Begin typing your search above and press return to search.

సాయికుమార్ జులుం చూపిస్తున్నాడు

By:  Tupaki Desk   |   1 Feb 2016 1:30 AM GMT
సాయికుమార్ జులుం చూపిస్తున్నాడు
X
ప్రేమకావాలి - లవ్లీ లాంటి సినిమాలతో బాగానే మొదలైంది సాయికుమార్ తనయుడు ఆది కెరీర్. కానీ ఆ తర్వాతే కుర్రాడు గాడి తప్పాడు. సుకుమారుడు - ప్యార్ మే పడిపోయానే - రఫ్ - గాలిపటం లాంటి సినిమాలు ఆది కెరీర్ ను దెబ్బ తీశాయి. దీంతో ఈసారి బాగా గ్యాప్ తీసుకుని సొంత బేనర్లో ‘గరం’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు ఆది. ఇప్పటిదాకా క్లాస్ సినిమాలే తీసిన మదన్ తొలిసారి మాస్ సినిమాను డైరెక్ట్ చేస్తున్నాడు. ‘సీతమ్మ అందాలు రామయ్య సిత్రాలు’తో దర్శకుడిగా పరిచయమైన శ్రీనివాస్ గవిరెడ్డి ఈ చిత్రానికి కథ - స్క్రీన్ ప్లే అందిస్తుండటం విశేషం.

కొడుకు కెరీర్ ను నిలబెట్టడానికి నిర్మాత అవతారం కూడా ఎత్తిన సాయికుమార్ రిలీజ్ విషయంలోనూ పెద్ద సాహసమే చేస్తున్నాడు. ఈ నెల 12న నాని సినిమా ‘కృష్ణగాడి వీర ప్రేమ గాథ’ మంచి క్రేజ్ మధ్య విడుదలవుతున్నప్పటికీ పట్టించుకోకుండా అదే రోజు కొడుకు సినిమా రిలీజ్ ప్లాన్ చేశాడు. అంతే కాదు.. ఆది సినిమాను తొలిసారి ఓవర్సీస్ లోనూ రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేశాడు. అక్కడ క్రేజ్ లేని చిన్న సినిమాలకు డిమాండ్ ఉండదు. పాజిటివ్ టాక్ వస్తే కొంచెం ఆలస్యంగా రిలీజ్ చేస్తారు. ఐతే సాయికుమార్ తన కొడుకు సినిమాను ప్రెస్టీజియస్ గా తీసుకుని అక్కడ రిలీజ్ ప్లాన్ చేశాడు. అక్కడ ఆదాయం ఎంతన్నది పట్టించుకోకుండా రిలీజ్ చేయడమే ప్రతిష్టాత్మకంగా తీసుకుని ముందుకెళ్లిపోతున్నాడు. మరి ‘గరం’ అక్కడ ఎలాంటి ఫలితాన్నందుకుంటుందో చూడాలి.