Begin typing your search above and press return to search.

బళ్లారి బాబు ప్లాన్ బాగుంది

By:  Tupaki Desk   |   20 Jun 2016 4:58 AM GMT
బళ్లారి బాబు ప్లాన్ బాగుంది
X
డిస్ట్రిబ్యూటర్ నుంచి నిర్మాతగా సడన్ గా దూసుకొచ్చాడు సాయి కొర్రపాటి అలియాస్ బళ్లారి సాయి. 2012కు ముందు కేవలం డిస్ట్రిబ్యూటర్ గానే ఇండస్ట్రీకి తెలుసు. ఈగ సినిమాతో నిర్మాతగా మారి స్టార్ ప్రొడ్యూసర్ అనిపించుకున్నాడు కొర్రపాటి రంగనాథ సాయి(సాయి కొర్రపాటి). ఏస్ డైరెక్టర్ ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం టాలీవుడ్లోనే కాక.. ఇతర భాషల్లోనూ ఎంత పాపులర్ అయిందో తెలిసిందే. ఈ చిత్రం తరువాత అందల రాక్షసి లాంటి క్యూట్ లవ్ స్టోరీని నిర్మించి కొత్త తారలను ఎంకరేజ్ చేసిన సాయి... బాహుబలి చిత్రాన్ని సీడెడ్లో పంపిణీ చేసి మంచి లాభాలనే ఆర్జించారు. బాలయ్యతో లెజెండ్ చిత్రాన్ని... నాగశౌర్యతో ఊహలు గుసగుసలాడే - దిక్కులు చూడకు రామయ్యలాంటి మినిమమ్ బడ్జెట్టు చిత్రాలను నిర్మించి చిన్న చిత్రాలనూ ఎంకరేజ్ చేశాడు సాయి.

కేవలం టాలీవుడ్ తారలతోనే కాకుండా... మళయాల నటుడు మోహన్ లాల్ ప్రధాన పాత్రలో ‘మనమంతా’ అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. అంతేనా.. నారా రోహిత్.. నాగశౌర్యతో కలిసి అవసరాల శ్రీనివాస్ డైరెక్షన్ లో జో అచ్యుతానందలాంటి మల్టీస్టారర్ చిత్రాన్ని తెరకెక్కస్తున్నాడు. ఈ రెండు చిత్రాలు పూర్తి కాగానే.. కొంత గ్యాప్ తీసుకుని వచ్చే ఏడాది నందమూరి మోక్షుతో కలిసి ‘ఆ రామయ్య రానే వచ్చాడు’ అనే సినిమాను తెరకెక్కించడానికి ఇప్పటి నుంచే ప్లాన్లు రచిస్తున్నాడు. ఇప్పటికే ఈ టైటిల్ ను ఫిలిం ఛాంబర్ లో రిజిస్టర్ కూడా చేయించాడు సాయి. ప్రస్తుతం బాలయ్య నటిస్తున్న వందో సినిమా గౌతమీ పుత్ర శాతకర్ణి చిత్రానికి సహాయదర్శకునిగా పనిచేస్తున్నాడు మోక్షు. ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ కానున్న విషయం తెలిసిందే. తన మొదటి డెబ్యూ సినిమాకి రెడీ అయ్యే ముందు.. ఫిలిం మేకింగ్ పై అవగాహన పెంచుకోవడానికి మోక్షు ఈ చిత్రానికి అసిస్టెంట్ గా క్రిష్ వద్ద పనిచేస్తున్నాడు.

ఈ చిత్రాన్ని మొదట సాయి కొర్రపాటి నిర్మించాలనుకున్నా... బడ్జెట్ పట్ల దర్శకుడి ఫ్లెక్సిబులిటీ కోసం ఈ చిత్రం నుంచి సైడైపోవాల్సి వచ్చింది. అయితే బాలకృష్ణ మాత్రం నీవు.. మోక్షు ను తెరంగేట్రం చేద్దువుగానీ అని చెప్పడంతో... ఈ నందమూరి హీరోను పరిచయం చేయడానికి ఇప్పటి నుంచే ప్రణాళికలు రచిస్తున్నాడు. నేడు సాయి కొర్రపాటి పుట్టిన రోజు.. వచ్చే ఏడాది ఈ పాటికల్లా.. ఈ నందమూరి హీరో నిర్మాతగా మారిపోతాడు. ఆల్ ది బెస్ట్ బళ్లారి బాబు.