Begin typing your search above and press return to search.

మరో మెగా అల్లుడు రెడీ అవుతున్నాడు

By:  Tupaki Desk   |   19 Jan 2018 6:14 AM GMT
మరో మెగా అల్లుడు రెడీ అవుతున్నాడు
X
టాలీవుడ్ లో ప్రస్తుతం మెగా ఫ్యామిలీ నుంచి వస్తోన్న హీరోల సంఖ్య గత కొంత కాలంగా పెరుగుతూ వస్తోంది. మెగా స్టార్ చిరంజీవి సెట్ చేసిన ట్రాక్ లో ప్రతి ఒక్కరు ఎవరి స్థాయిలో వారు టాలెంట్ ను నిరూపించుకుంటూ సత్తా చాటుతున్నారు. పవన్ కళ్యాణ్ నుంచి మొదలు పెడితే అల్లు అర్జున్ - రామ్ చరణ్ లు వారి స్టైల్ లో మెప్పించి వారికంటు ఒక మార్కెట్ ను సెట్ చేసుకున్నారు.

ఆ తరువాత వచ్చిన సాయి ధరమ్ తేజ్ - వరుణ్ తేజ్ కూడా మంచి హిట్స్ అందుకొని అభిమానులను గెలుచుకున్నారు. అల్లు శిరీష్ - నిహరికలు కూడా మంచి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక ఇప్పుడు వారి కుటుంబం నుంచి మరో ఇద్దరు కూడా వెండితెరపై చిందులు వేయడానికి సిద్దమయ్యారు. గత కొంత కాలంగా మెగా అల్లుడు కళ్యాణ్ తన తొలి సినిమా కోసం సిద్ధం అవుతున్నాడని వార్తలు ఓ రేంజ్ లో వస్తోన్న సంగతి తెలిసిందే. దర్శకుడు నిర్మాత కూడా సెట్ అయ్యారు. దాదాపు హీరోయిన్ కూడా ఫిక్స్ అయ్యిందని త్వరలో సినిమాని సెట్స్ పైకి తీసుకెళతారని టాక్ నడుస్తోంది.

ఇక సాయి ధరమ్ తేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్ కూడా త్వరలో సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇవ్వనున్నాడు అని తెలుస్తోంది. నిర్మాత సాయి కొర్రపాటి తన ప్రొడక్షన్ లో ఈ మెగా మేనల్లుడిని పరిచయం చేయబోతున్నాడట. అయితే గత కొంత కాలంగా వైష్ణవ్ తేజ్ ఎక్కువగా తన చిన మామయ్య పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ వద్దే ఎక్కువగా కనిపించేవాడట. అంతే కాకుండా నటనలో మెళకువలు నేర్చుకుంటూ ఫ్యామిలీ లోని ప్రతి ఒక్కరి షూటింగ్ కి అప్పుడప్పుడు వెళుతుండేవాడట. ఇద్దరి మామయ్య ల సపోర్ట్ ఇతనికి బలంగా ఉంది. మరి ఎంతవరకు సక్సెస్ అవుతాడో చూడాలి.