Begin typing your search above and press return to search.

అన్ స్టాపబుల్ లో పవన్ అల్లుడు కూడా..

By:  Tupaki Desk   |   21 Jan 2023 11:10 AM GMT
అన్ స్టాపబుల్ లో పవన్ అల్లుడు కూడా..
X
నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా ఉన్నటువంటి అన్ స్టాపబుల్ షో రేంజ్ మరో లెవల్ కు వెళ్లే ఎపిసోడ్ రాబోతోంది. మొట్టమొదటిసారి నందమూరి బాలకృష్ణ అలాగే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఎదురెదురుగా మాట్లాడుకుంటూ కనిపించబోతున్నారు. ఇక వీరు ఏ విధంగా మాట్లాడుకుంటారు? అలాగే ఎలాంటి విషయాల గురించి చర్చుకుంటారో అని ఫ్యాన్స్ అందరు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

ఒకవైపు రాజకీయంగా మరొకవైపు సినిమా పరంగా కూడా వీరి మధ్యలో అనేక రకాల కథనాలు వెలువడుతూనే ఉంటాయి. ఇక అలాంటిది విషయాలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారుతున్న సమయంలో పవన్ కళ్యాణ్ బాలకృష్ణ ఇలాంటి షోలో కనిపించడం మరింత హైలెట్ అవుతుందనే చెప్పాలి. ఇటీవల విడుదలైన ప్రోమో లకు కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక ఇది ప్రభాస్ ఎపిసోడ్ కంటే హై రేంజ్ లో వర్కౌట్ అవుతుంది అని ఇప్పటికే ప్రోమోలతో అర్ధమయ్యింది.

అందుకే అప్పుడు వచ్చిన సమస్యలు మళ్ళీ రిపిట్ అవ్వకుండా ఆహా నిర్వాహకులు యాప్ పై మరింత జాగ్రత్తలు తీసుకోబోతున్నారు. అయితే పవన్ కళ్యాణ్ ఎపిసోడ్లో మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ కూడా కనిపించబోతున్నట్లు క్లారిటీ వచ్చేసింది. అందుకు సంబంధించిన ఫోటో కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

అయితే సాయిధరమ్ తేజ్ మాత్రం సింపుల్ గా పంచె కట్టుతో కనిపించడం విశేషం. పవన్ కళ్యాణ్ తో అతను ఒక సినిమా కూడా చేయడానికి రెడీ అవుతున్న విషయం తెలిసిందే.

తమిళంలో సక్సెస్ అయిన వినోదాయ సీతాం రీమేక్లో వీళ్ళు కనిపించబోతున్నారు. ఇక అంతకంటే ముందుగా పవన్ కళ్యాణ్ సాయి ధరమ్ తేజ్ ఇద్దరు కూడా నందమూరి బాలకృష్ణ అన్ స్టాపబుల్ కనిపిస్తూ ఉండడం విశేషం.

ఫాన్స్ అయితే ఈ ఎపిసోడ్ కోసం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు అని మరోసారి సోషల్ మీడియాలో బజ్ చూస్తేనే అర్ధమవుతుంది. ఇక ఈ ఎపిసోడ్ లో పవన్ సాయి ధరమ్ తేజ్ ఎపిసోడ్ పై క్లారిటీ ఇవ్వనున్నారు.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.