Begin typing your search above and press return to search.

ఇచ్చిన మాట నిలబెట్టుకుని ఓపెనింగ్‌ కూడా చేసిన మెగా హీరో

By:  Tupaki Desk   |   18 Dec 2020 7:00 PM IST
ఇచ్చిన మాట నిలబెట్టుకుని ఓపెనింగ్‌ కూడా చేసిన మెగా హీరో
X
సినిమాల్లో హీరోలు అనాధల కోసం ఎన్నో మంచి పనులు చేయడం.. వారికి నేను ఉన్నాను అంటూ రౌడీలతో పోరాటం చూశాం. కాని రియల్‌ లైఫ్ లో హీరోలు ఎక్కువగా సామాజిక విషయాల గురించి పట్టించుకోవడం మనం చూడలేదు. ఏదైనా ప్రత్యేక సందర్బంగా వచ్చినప్పుడు మాత్రమే తమవంతు సాయం చేసేందుకు ముందుకు వస్తారు. ఆతర్వాత మళ్లీ ఎవరు కూడా పట్టించుకోరు. కాని సాయి ధరమ్‌ తేజ్‌ మాత్రం ఒక సాయం చేసేందుకు ముందుకు వచ్చాడు. దాన్ని మర్చి పోకుండా కంటిన్యూస్‌ గా దానికి సంబంధించిన అప్‌ డేట్ అడిగి తెలుసుకుంటూ వచ్చాడు. డబ్బులు ఇచ్చాం చేతులు దులుపుకున్నాం అని కాకుండా ఓపెనింగ్ కు కూడా వెళ్లాడు. ఇంతకు దేని గురించి అనుకుంటున్నారా.. ఏడాది క్రితం తేజూ ఒక అనాధ ఆశ్రమం గురించి తెలుసుకుని దాన్ని బాగు చేయించేందుకు ముందుకు వచ్చాడు. అన్నట్లుగానే ఆ భవనం మొత్తం బాగు చేయించాడు.

విజయవాడకు చెందిన అమ్మ ప్రేమ ఆశ్రమం శిధిలావస్తకు చేరిందని.. ఆర్థిక సమస్యతో నిర్వాహకులు సతమతం అవుతున్నారనే విషయం సోషల్‌ మీడియా ద్వారా తెలుసుకున్న సాయి ధరమ్‌ తేజ్‌ సాయం చేసేందుకు ముందుకు వచ్చాడు. ఆ భవనంను పూర్తిగా బాగు చేయిస్తాను అని అలాగే అందులో ఉన్న వారి కోసం తాను అండగా నిలుస్తాను అంటూ చెప్పుకొచ్చాడు. అన్నట్లుగానే సాయి ధరమ్‌ తేజ్‌ భవనం నిర్మాణం పూర్తి చేయించాడు. నిన్న రాత్రి సమయంలో ఆ భవనంను ప్రారంభించడంతో పాటు అందులో ఉన్న వారిని కలిసి బాగోగులు తెలుసుకున్నాడు. ఈ సమయంలో అక్కడకు వెళ్లడం అంటే నిజంగా తేజూ మంచి మనసుకు హ్యాట్సాప్‌ అంటూ మెగా అభిమానులు ప్రశంసిస్తున్నారు. మామయ్యల మాదిరిగా తేజూకు కూడా మంచి మనసుందని అభిమానులు అంటున్నారు.