Begin typing your search above and press return to search.

వీడియో : మామకి ఫ్యాన్‌ గా మారి 'జల్సా' చేసిన సుప్రీమ్‌ హీరో

By:  Tupaki Desk   |   2 Sept 2022 6:00 PM IST
వీడియో : మామకి ఫ్యాన్‌ గా మారి జల్సా చేసిన సుప్రీమ్‌ హీరో
X
నేడు పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో భారీ ఎత్తున జల్సా సినిమా ప్రత్యేక ప్రదర్శన ఏర్పాటు చేసిన విషయం తెల్సిందే. ఈ సినిమాకు పవన్ కళ్యాణ్ అభిమానులు భారీ ఎత్తున హాజరు అయ్యారు. ఇండస్ట్రీలో ఉన్న పవన్‌ కళ్యాణ్ అభిమానులు పలువురు జల్సా ప్రత్యేక ప్రదర్శన కు హాజరు అయ్యారు.

రవితేజ తనయుడు మహాధన్‌ తన స్నేహితులతో కలిసి జల్సా సినిమాను ఎంజాయ్ చేసిన వీడియో సోషల్‌ మీడియా లో వైరల్‌ అయిన విషయం తెల్సిందే. ఆ వీడియో ట్రెండ్‌ అవుతున్న సమయంలోనే మెగా హీరో సాయి ధరమ్‌ తేజ్‌ వీడియో ఒకటి నెట్టింట తెగ వైరల్ అవుతోంది.

జల్సా సినిమా ను సాయి ధరమ్‌ తేజ్ థియేటర్‌ కు వెళ్లి చూశాడు. పవన్ అభిమానులతో కలిసి కేరింతలు కొడుతూ సాయి ధరమ్‌ తేజ్ హంగామా చేశాడు. మామయ్య కి అభిమానిగా మారి జల్సా సినిమా ప్రదర్శింపబడుతున్న స్క్రీన్‌ పై పవన్‌ కళ్యాణ్ కనిపించిన వెంటనే కాగితాలు విసురుతూ తన అభిమానం చాటుకున్నారు.

గతంలో కూడా మామ పట్ల తన అభిమానం మరియు ప్రేమను వేరు వేరు రూపాల్లో చూపించాడు. పవన్ కళ్యాణ్‌ కి కూడా సాయి ధరమ్‌ తేజ్‌ అంటే ప్రత్యేకమైన అభిమానం.

అందుకే సాయి ధరమ్‌ తేజ్ తో కలిసి పవన్ కళ్యాణ్ వినోదయ్య సిత్తం సినిమా రీమేక్ లో నటించబోతున్నాడు. సముద్రఖని దర్శకత్వంలో ఆ సినిమా రూపొందబోతోంది. త్వరలోనే రీమేక్‌ కు సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.