Begin typing your search above and press return to search.

ఇద్దరూ కలిస్తే మహా మాస్ అవ్వడం ఖాయం!

By:  Tupaki Desk   |   20 Dec 2019 11:00 PM IST
ఇద్దరూ కలిస్తే మహా మాస్ అవ్వడం ఖాయం!
X
గత కొంత కాలంగా టాలీవుడ్ లో మల్టి స్టారర్ల ట్రెండ్ ఊపందుకున్న విషయం తెలిసిందే. ఎన్టీఆర్.. రామ్ చరణ్ లాంటి పెద్ద స్టార్లు కూడా ఇప్పుడు 'RRR' లో నటిస్తున్నారు. ఇక పోయిన వారం రిలీజ్ అయిన 'వెంకీమామ' బాక్స్ ఆఫీస్ దగ్గర విజయం సాధించడంతో ఒక్కసారిగా అందరి దృష్టి మరోసారి మల్టిస్టారర్లపై పడింది. రీసెంట్ గా సాయి ధరమ్ తేజ్ మల్టి స్టారర్ సినిమాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

'ప్రతిరోజు పండగే' సినిమా ప్రమోషన్లతో మెగా హీరో తేజు బిజీగా ఉన్నాడు. రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో మెగా హీరోలలో ఎవరితో కలిసి మల్టిస్టారర్ చెయ్యాలని ఉందని అడిగితే.. వరుణ్ తేజ్ తో కలిసి నటించాలని ఉందని చెప్పాడు. అదే మెగా ఫ్యామిలీ కాకుండా బయటి హీరోలలో ఎవరితో కలిసి మల్టిస్టారర్ చేస్తారు.. అని అడిగితే రవితేజ గారితో నటించాలని ఉందని చెప్పాడు. "మా ఇద్దరి మధ్య ఇలాంటి డిస్కషన్ చాలాసార్లు వచ్చింది. రవితేజ గారిని ఎప్పుడు కలిసినా ఆయన 'మనిద్దరం కలిసి ఒక సినిమా చేయాలబ్బాయ్' అంటూ ఉంటారు" అని చెప్పుకొచ్చాడు తేజు.

రవితేజ కు మాస్ మహారాజా అని పేరు. ఆయన ఎనర్జీనే వేరు. సరైన సినిమా పడితే బాక్స్ ఆఫీసుకు జింతాత జిత తప్పదు. ఇక తేజు కూడా ఎనర్జీకి కేరాఫ్ అడ్రెస్. ఇద్దరూ కలిసి ఒక పవర్ ఫుల్ సినిమా చేస్తే మాస్ ప్రేక్షకులకు అన్ని పండగలు ఒకేసారి వచ్చినట్టే. చూద్దాం.. ఎవరైనా ఫిలింమేకర్ ఈ ఎనర్జిటిక్ హీరోలకు తగ్గ స్క్రిప్ట్ తో సంప్రదిస్తే త్వరగా గ్రీన్ సిగ్నల్ వస్తుందేమో!