Begin typing your search above and press return to search.

మెగా హీరోల మధ్యనే రేస్!!

By:  Tupaki Desk   |   31 Oct 2017 12:30 PM IST
మెగా హీరోల మధ్యనే రేస్!!
X

ఫిదా మూవీతో దాదాపు 50 కోట్ల వసూళ్లు రాబట్టి.. వరుణ్ తేజ్ టాప్ గేర్ లో ఉన్నాడు. ప్రస్తుతం వెంకీ అట్లూరి దర్శకత్వంలో వరుణ్ తేజ్ ఓ సినిమా చేస్తుండగా.. ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 9న విడుదల చేయనున్నట్లు ఇప్పుడు నిర్మాతల నుంచి అఫీషియల్ స్టేట్మెంట్ వచ్చింది.

ఇది నిజంగా షాక్ అనాల్సిందే. ఎందుకంటే.. అదే డేట్ కు మరో మెగా హీరో సాయిధరం తేజ్ నటిస్తున్న మూవీ ఇంటెలిజెంట్ ను విడుదల చేయాలని చూస్తున్నారు. ఇప్పుడు సడెన్ గా వరుణ్ తేజ్ మూవీ తొలిప్రేమను ఫిబ్రవరి 9 విడుదల అని చెప్పడం ఆశ్చర్యకరమే. టైటిల్ పై అఫీషియల్ అనౌన్స్ మెంట్ రావాల్సి ఉండగా.. ఫిబ్రవరిలో ఓ మెగా వార్ కనిపించనుందనే సంగతి తేలిపోయింది. ఆ తర్వాత కూడా ఈ పోటీ కొనసాగనుండడం ఆశ్చర్యకరం. ఏప్రిల్ నెలలో రామ్ చరణ్ వర్సెస్ బన్నీ పోటీ కనిపించనుంది.

రామ్ చరణ్ రంగస్థలం.. అల్లు అర్జున్ నా పేరు సూర్య ఏప్రిల్ లోనే విడుదల కానున్నాయి. ఇవి రెండూ ఒకే రోజు విడుదల కాకపోయినా.. ఒకటే నెలలో వచ్చినపుడు.. హిట్ రేంజ్ పై పోలికలు కచ్చితంగా వచ్చేస్తాయి. గ్యాప్ లేకపోతే ఆ సంగతి వేరు. కానీ రెండు మూడు వారాల గ్యాప్ లో బన్నీ.. చెర్రీలు తమ సినిమాలు విడుదల చేస్తే.. కచ్చితంగా సక్సెస్ రేంజ్ అనే పాయింట్ బయటకు వస్తుంది. ఇది మెగా హీరోలకు తగిన వ్యవహారం కాదనే టాక్ ఇండస్ట్రీలో వినిపిస్తోంది.