Begin typing your search above and press return to search.

ఆ టైటిల్ మీదే మనసు పడ్డారు

By:  Tupaki Desk   |   7 April 2018 10:48 AM GMT
ఆ టైటిల్ మీదే మనసు పడ్డారు
X
రొటీన్ కమర్షియల్ సినిమానే నమ్ముకుంటూ వచ్చిన మెగా హీరో సాయిధరమ్ తేజ్ కు ఈమధ్య కాలంలో హిట్ అన్నదే కరవైపోయింది. ఎన్నో ఆశలు పెట్టుకుని మాస్ డైరెక్టర్ వి.వి.వినాయక్ డైరెక్షన్ లో చేసిన ఇంటిలిజెంట్ సినిమా ప్రేక్షకులను ఏ మాత్రం ఆకట్టుకోలేకపోయింది. వరస ఫ్లాపులతో తేజు బాక్సాఫీస్ రేసులో బాగా వెనుకబడిపోయాడు.

దీంతో తేజు రూటు మార్చి ప్రేమ కథా చిత్రాల స్పెషలిస్టు కరుణాకరన్ డైరెక్షన్ లో చేస్తున్నాడు. ఈ సినిమా అందమైన చందమామ టైటిల్ పెడతారని ముందుగా టాక్ వచ్చింది. అది మరీ పొయిటిక్ గా ఉందనే మాట కూడా వినిపించింది. తరవాత ‘‘దేవుడు వరమందిస్తే’’.. ‘‘తేజ్.. ఐ లవ్ యూ’ టైటిళ్లు వినిపించాయి. ఇంకా టైటిల్ కన్ఫర్మ్ చేయలేదని చిత్ర యూనిట్ ప్రకటించినా కానీ యూనిట్ మాత్రం ఇందులో తేజ్.. ఐ లవ్ యూ టైటిల్ వైపే మొగ్గు చూపిస్తోందని స్ట్రాంగ్ రూమర్ ప్రస్తుతం వినిపిస్తోంది. ఈ టైటిల్ నే అఫీషియల్ గా ప్రకటించే అవకాశం ఉందని యూనిట్ సభ్యుడొకరు తెలిపారు.

తేజ్.. ఐ లవ్ యూ సినిమాను క్రియేటివ్ కమర్షియల్స్ బ్యానర్ పై కె.ఎస్.రామారావు నిర్మిస్తున్నారు. ప్రేమమ్ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్ ఇందులో హీరోయిన్ గా నటిస్తోంది. ప్రస్తుతం షూటింగ్ చివరి దశకు వచ్చింది. జూన్ లో ఈ సినిమా విడుదల చేయడానికి మేకర్లు సన్నాహాలు చేస్తున్నారు.