Begin typing your search above and press return to search.

హలో బ్యూటీ తో జోడీ అంటున్న మెగా హీరో

By:  Tupaki Desk   |   15 Oct 2018 8:52 AM IST
హలో బ్యూటీ తో జోడీ అంటున్న మెగా హీరో
X
మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ ను బాక్స్ ఆఫీస్ వద్ద వరస ఫ్లాపులు పలకరించడంతో ఓ మూడు నెలలు సినిమాల నుండి బ్రేక్ తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ గ్యాప్ లో అమెరికా కు వెళ్ళి రీచార్జ్ కావడమే కాదు తన ఫిట్నెస్ పై ఫోకస్ చేసి మళ్ళీ స్లిమ్ అవతారం లోకి మారాడు. ఇప్పుడు తన నెక్స్ట్ సినిమా లాంచ్ ఈవెంట్ కు రెడీ అయ్యాడు.

'నేను శైలజ' ఫేమ్ కిషోర్ తిరుమల దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ సినిమాకు ఈ రోజే హైదరాబాద్ లో పూజాకార్యక్రమాలు జరపనున్నారని సమాచారం. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ లో తెరకెక్కనున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ నవంబర్ నుండి జరుపుతారట. ఇక ఈ సినిమాలో సాయి ధరమ్ కు జోడీగా కేరళ బ్యూటీ కళ్యాణి ప్రియదర్శన్ ను ఫైనలైజ్ చేశారట. కళ్యాణి అఖిల్-విక్రమ్ కుమార్ చిత్రం 'హలో' ద్వారా హీరోయిన్ గా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమాతో పాటుగా శర్వానంద్ నెక్స్ట్ సినిమాలో కూడా హీరోయిన్ గా ఎంపిక అయిందట.

దర్శకుడు కిషోర్ తిరుమల స్ట్రాంగ్ జోన్ అయిన రొమాంటిక్ కామెడి జోనర్ లోనే సాయి ధరమ్ సినిమా కూడా తెరకెక్కనుందట. ఈ సినిమాటైటిల్ ఇంకా అధికారికంగా ప్రకటించలేదు గానీ 'చిత్రలహరి' అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారని ఇప్పటికే వార్తలు వచ్చాయి. మరి ఈ సినిమాతో అయిన మెగా మేనల్లుడికి హిట్ వస్తుందేమో వేచి చూడాలి.