Begin typing your search above and press return to search.
సాయిధరమ్ తేజ్ తో తొలిప్రేమ రీమెక్!
By: Tupaki Desk | 25 Sept 2017 12:13 PM ISTపవన్ కళ్యాణ్ ఇంతవరకు నటించిన సినిమాల్లో ది బెస్ట్ మూవీ ఏదంటే వెంటనే వచ్చే ఏకైక ఆన్సర్ తొలిప్రేమ. పవన్ కళ్యాణ్ ని పవర్ స్టార్ గా మార్చేసిన ఈ సినిమాకు ఇప్పటికీ క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు. ప్రేమకథా చిత్రాల్లో ఓ కొత్త ఒరవడి తీసుకొచ్చిన తొలిప్రేమని రీమేక్ చేస్తున్నారనే న్యూస్ ప్రస్తుతం ఫిల్మ్ నగర్ లో వినిపిస్తోంది. అంతేకాదు ఈ రీమేక్ స్వయంగా తొలిప్రేమ దర్శకుడు కరుణాకరణ్ డైరెక్ట్ చేస్తున్నాడని తెలిసింది. ఇటీవలే మెగా కాంపౌండ్ హీరో సాయిధరమ్ తేజ్ - కరుణాకరణ్ కాంబినేషన్ లో ఓ సినిమా మొదలైన సంగతి తెలిసిందే. కరుణాకరన్ ఈ సినిమా గురించి మాట్లాడుతూ కాన్సెప్ట్ తొలి ప్రేమ లా ఉంటుంది అని చెప్పారు. అయితే ఇది తొలిప్రేమ రీమేక్ అని సినీజనాలు అంటున్నారు.
కెరీర్ స్టార్టింగ్ లో వరుస హిట్లు కొట్టి ఇప్పుడు వరుస ఫ్లాపులు తింటున్న సాయిధరమ్ తన కెరీర్ ని మళ్లీ గాఢీలోకి పెట్టేందుకే కురుణాకరన్ తో కలిసి ఈ రీమేక్ ప్లాన్ చేసినట్లు తెలిసింది. అంతేకాదు మెగా అభిమానులు సైతం సాయిధరమ్ ని తొలిప్రేమ్ రీమేక్ చేయాల్సిందిగా ఎప్పటినుంచో అడుగుతుండటంతో ఈ క్రేజీ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వచ్చిందని విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. అయితే ఇందులో హీరోయిన్ ఎవరు, తదితర విషయాల పై ప్రస్తుతానికి క్లారిటీ లేదు, త్వరలోనే ఆ వివరాల్ని అధికారికంగా ప్రకటించే అవకాశం ఉన్నట్లు సమాచారం. మరి తన మావయ్య పవన్ కళ్యాణ్ ని పవర్ స్టార్ గా మార్చేసిన తొలిప్రేమ కథ ఇప్పుడు సాయిధరమ్ కెరీర్ ఎలాంటి మలుపు తిప్పుతుందో లెట్స్ వెయిట్ అండ్ సీ!