Begin typing your search above and press return to search.
పెళ్లెప్పుడు అంటే పాపం శిరీష్ ని ఇరికిస్తాడేం?
By: Tupaki Desk | 15 Dec 2020 9:19 AM ISTటాలీవుడ్ సెలబ్రిటీల్లో లాక్ డౌన్ చాలా మార్పులు తీసుకొచ్చింది. పెళ్లంటే ఆమడదూరం పారిపోయే వారంతా లాక్ డౌన్ లో పెళ్లికి రెడీ అయిపోయి ఆశ్చర్యాన్ని కలిగించారు. ఒక విధంగా ప్రేక్షకులతో పాటు వారిని అభిమానించే వారిని తమ సడన్ నిర్ణయాలతో షాకిచ్చారు. కానీ యంగ్ హీరో.. మెగామేనల్లుడు సాయా ధరమ్ తేజ్ మాత్రం అందుకు భిన్నంగా ఆలోచిస్తూ షాకిస్తున్నారు. టాలీవుడ్ లో వున్న మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ లలో సాయితేజ్ ముందు వరుసలో ఉన్నారన్నది తెలిసిందే.
ప్రభాస్ తరువాత ప్రముఖంగా ఈ హీరో పేరే వినిపిస్తోంది. కానీ తను మాత్రం మరో ఐదేళ్ల వరకు పెళ్లి ఊసే ఎత్తనని చెబుతున్నాడు. అంతే కాకుండా విచిత్రమైన లాజిక్ లని చెప్పి ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాడు. ఇంత కాలం నిహారిక పెళ్లి తరువాతే తన పెళ్లని చెప్పిన సాయి ధరమ్ తేజ్ ఇప్పుడు అల్లు శిరీష్ ని టార్గెట్ చేస్తున్నాడు. తన కంటే శిరీష్ పెద్దవాడని అతని పెళ్లి తరువాతే తన పెళ్లి అని మెలిక పెడుతూ శిరీష్ ని టార్గెట్ చేయడం విచిత్రంగా వుందంటున్నారు.
అయితే ఇటీవల ప్రేమ పెళ్లిళ్లు చేసుకున్న హీరోల్లా తాను లవ్ మ్యారేజ్ చేసుకోనని తను ఎప్పుడు పెళ్లి చేసుకున్నా అది పెద్దలు కుదిర్చినదే అవుతుందని చెబుతున్నాడు. పెళ్లి కాకపోవడం వల్లే తాను లాక్ డౌన్ ని ఎంజాయ్ చేశానని పెళ్లైతే ఎంజాయ్ చేసుండే వాడిని కానని చెబుతున్నాడు. ఈ లాజిక్ ఏంటో ఎవరికీ అర్థం కావడం లేదు.