Begin typing your search above and press return to search.

ప్లాప్ 'డైరెక్టర్' పై తన నమ్మకాన్ని బయటపెట్టిన మెగాహీరో..!!

By:  Tupaki Desk   |   22 Dec 2020 12:45 PM IST
ప్లాప్ డైరెక్టర్ పై తన నమ్మకాన్ని బయటపెట్టిన మెగాహీరో..!!
X
మెగా ఫ్యామిలీలో హిట్టా ఫట్టా అనే తేడా లేకుండా వరుసగా సినిమాలు చేస్తున్న హీరో సాయిధరమ్ తేజ్. ఈ మెగాహీరో ఇండస్ట్రీలో అడుగు పెట్టినప్పటి నుండి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకునే ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు. మారుతీ దర్శకత్వంలో వచ్చిన 'ప్రతిరోజు పండగే' సినిమాతో చివరి హిట్ అందుకున్నాడు. చాలా గ్యాప్ తర్వాత వచ్చిన హిట్ కావడంతో ఇక నుండి కాస్త జాగ్రత్తగా సినిమాలు చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తుంది. ప్రస్తుతం సుబ్బు దర్శకత్వంలో నటించిన 'సోలో బతుకే సో బెటర్' అనే సినిమా ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా ఈ నెల 25న విడుదల కాబోతుంది. ఇక ప్రస్థానం సినిమాతో తన మార్క్ చూపించిన దేవాకట్టా దర్శకత్వంలో సాయిధరమ్ తేజ్ కొత్త సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇంటెన్స్ పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కనున్న ఈ సినిమాను జె. భగవాన్, పుల్లారావులు సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

డైరెక్టర్ దేవాకట్టా సినిమాలు అంటేనే కథ కథనాలు డిఫరెంట్ గా ఉంటాయి. ఈ సినిమాలో సాయిధరమ్ ను కూడా విభిన్నమైన పాత్రలో చూపించనున్నాడట డైరెక్టర్. ఈ విషయాన్నీ సాయిధరమ్ స్వయంగా వెల్లడించినట్లు సమాచారం. డైరెక్టర్ దేవాకట్టా పై ఎంతో నమ్మకం పెట్టుకున్న ఈ మెగాహీరో.. తాజాగా డైరెక్టర్ పనితనం గురించి పొగుడుతూ వచ్చాడు. ఇప్పటికే మేజర్ పార్ట్ షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా పక్కా హిట్ అవుతుందని తెలిపాడట. అంతేగాక వరుస ప్లాప్ లలో ఉన్న దేవాకట్టా ఈసారి మంచి స్ట్రాంగ్ కంటెంట్ తో తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తుంది. ఇక పూర్తిగా పొలిటికల్ బ్యాక్ డ్రామాతో తెరకెక్కుతున్న ఈ సినిమాలో సాయిధరమ్ తేజ్ స్టూడెంట్స్ యూనియన్ నాయకుడిగా కనిపిస్తాడని ఇండస్ట్రీ టాక్.