Begin typing your search above and press return to search.
మెగా ఫ్యాన్ ఫోన్ చేసి సినిమాలు చేయొద్దన్నాడు
By: Tupaki Desk | 16 Dec 2020 10:00 AM ISTమెగా ఫ్యామిలీ నుండి హీరోగా పరిచయం అయిన సాయి ధరమ్ తేజ్ కెరీర్ ఆరంభంలో చాలా ఇబ్బందులు పడ్డాడు. ఆయన కమిట్ అయిన మొదటి సినిమా 'రేయ్' ఆర్థిక ఇబ్బందుల కారణంగా సినిమా వాయిదా పడింది. అది ఏకంగా రెండేళ్ల ఆలస్యం అయ్యింది. ఆ సమయంలోనే తేజ్ చేసిన మరో సినిమా కూడా ఏవో కారణాల వల్ల ఆలస్యం అయ్యింది. తేజూ పిల్లా నువ్వు లేని జీవితం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అంతకు ముందు రెండు సినిమాలు ఆగిపోవడంతో సాయి ధరమ్ తేజ్ కు ఒక మెగా అభిమాని కాల్ చేసి ఇక మీరు చేసింది చాలు.. మీ సినిమాల పట్ల మాకేం ఆసక్తి లేదు మీరు సినిమాలు ఆపేస్తే మంచిది అన్నాడు.
ఆయన మాటలు నాకు షాకింగ్ గా అనిపించాయి. ఆ సమయంలో నేను ఇప్పటికే నేను కమిట్ అయిన సినిమాలు పూర్తి చేస్తాను. అప్పటికి మీకు నచ్చకుంటే మీరు అన్నట్లుగానే సినిమాలను వదిలేస్తాను అన్నాను. ఆ అభిమానే కొన్నాళ్ల తర్వాత నాకు కాల్ చేసి సారీ సర్ మీరు సినిమాల్లో బాగా చేస్తున్నారు. తప్పకుండా మీకు మంచి భవిష్యత్తు ఉంది. మామకు తగ్గ అల్లుడు అనిపించుకుంటారు. మీరు మరిన్ని సినిమాలు చేయాలని కోరుకుంటున్నాం. ముందు ముందు మీరో స్టార్ అవుతారని భావిస్తున్నాను అంటూ చెప్పుకొచ్చాడు. ఆయన మాటలు నాకు మరింత ఉత్తేజాన్ని ఇచ్చాయని తేజూ చెప్పుకొచ్చాడు.