Begin typing your search above and press return to search.

ఫస్ట్ సైట్: సాయిధరమ్ కొత్త సినిమా

By:  Tupaki Desk   |   25 April 2018 5:16 PM IST
ఫస్ట్ సైట్: సాయిధరమ్ కొత్త సినిమా
X
ప్రస్తుతం వరుస పరాజయల్లో ఉన్న హీరోల్లో సాయి ధరమ్ తేజ్ ఒకరు. మెగా ఫ్యామిలీ లో అందరు హీరోలు ఒక లెవెల్లో వారి స్టార్ డమ్ ని సెట్ చేసుకుంటూ వెళుతుంటే మనోడు కాస్త ఎక్కువగానే తడబడుతున్నాడు. వరుసగా అయిదు పరాజయాలు అందడంతో హిట్టు కోసం చాలా కష్టపడుతున్నాడు. ముఖ్యంగా ఇంటిలిజెంట్ సినిమా అయితే ఎవరు ఊహించని విధంగా డిజాస్టర్ అయ్యింది. ఇటు నిర్మాత అటు పంపిణీ దారులు దారుణమైన లాస్ చూశారు.

ఇక ఆ విషయాన్ని పక్కనపెడుతే.. ప్రస్తుతం సాయి ధరమ్ తేజ్ లవ్ స్టోరీల దర్శకుడు ఏ.కరుణాకర్ తో ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఫుల్ లవ్ ఎంటర్టైనర్ గా రాబోతోన్న ఈ సినిమాపై మెగా మేనల్లుడు చాలా ఆశలే పెట్టుకున్నాడు. అయితే సినిమాకు సంబంధించిన హడావిడిని సాయి ఈ సారి కొంచెం ముందుగానే మొదలు పెట్టాడు. ఫస్ట్ లుక్ రిలీజ్ చేసి ఆడియెన్స్ ని ఆకట్టుకోవాలని చూస్తున్నాడు. ఈ నెల 28 ఈ ప్రాజెక్ట్ ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేస్తున్నట్లు ఒక పోస్టర్ ద్వారా తెలియజేశారు.

దర్శకుడు కరుణాకరన్ కూడా విజయాన్ని చూసి చాలా కాలమవుతోంది. 2010 డార్లింగ్ సినిమా తరువాత మళ్లీ ఇంత వరకు హిట్ సినిమా చేయలేదు. అందుకే సాయి ధరమ్ తేజ్ ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని తన మ్యాజిక్ ని సక్సెస్ గా ప్రజెంట్ చేయాలనీ అనుకుంటున్నాడు. సమ్మర్ ఎండింగ్ లో సినిమా రిలీజ్ కానుంది. ఇక సినిమాలో కేరళ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటిస్తుండగా గోపి సుందర్ మ్యూజిక్ అందిస్తున్నాడు.