Begin typing your search above and press return to search.

ఫోటో స్టోరీ : రొమాన్స్ పిచ్చెక్కిస్తున్నారుగా..

By:  Tupaki Desk   |   3 May 2018 5:40 AM GMT
ఫోటో స్టోరీ : రొమాన్స్ పిచ్చెక్కిస్తున్నారుగా..
X
సాయిధరమ్ తేజ్.. రొమాన్స్.. ఈ రెండు మాటలకు అస్సలు సూటవ్వదనే చెప్పాలి. ఎందుకంటే మెగాస్టార్ మేనల్లుడు మొదట్నుంచి యాక్షన్ ఎంటర్టైనర్లే చేస్తూ వచ్చాడు. వాటిలో రొమాన్స్ చిన్న పార్ట్ లాగా ఉండేది తప్ప కుర్రాడు.. ఫుల్ లెంగ్త్ రొమాంటిక్ మూవీస్ అయితే ఇంతవరకు చేయలేదు. ఐతే ఇప్పుడు ప్రేమకథల స్పెషలిస్టు కరుణాకరన్ డైరెక్షన్లో ‘తేజ్ ఐ లవ్ యూ’ అనే ప్యూర్ లవ్ స్టోరీ చేస్తున్నాడు. తేజును ఇలాంటి సినిమాలో చూడటమే చాలా కొత్తగా ఉంటుందని అంటున్నారు.

ఇందులో అసలేమాత్రం యాక్షన్ జోలికి వెళ్లకుండా పూర్తిగా లవ్ యాంగిల్లోనే సినిమాను నడిపించబోతున్నారట. ఈ చిత్ర ఫస్ట్ లుక్.. ఫస్ట్ టీజర్ కూడా అదే ఇండికేషన్స్ ఇచ్చాయి.

తాజాగా ఈ చిత్ర బృందం మరో రొమాంటిక్ పిక్ తో సినిమా ఎలా ఉండబోతోందో చెప్పే ప్రయత్నం చేసింది. ప్రస్తుతం ఈ చిత్ర బృందం పాటల చిత్రీకరణ కోసం పారిస్ లో ఉంది. అక్కడి నుంచి ఒక పిక్ రిలీజ్ చేశారు. మంచు కొండల్లో ప్రేమ మైకంలో మునిగిపోయి రొమాన్స్ చేస్తున్నారు తేజు-అనుపమ ఇందులో. చూడ్డానికి చాలా ఆహ్లాదంగా అనిపిస్తోంది ఈ స్టిల్. ఇప్పటికైతే ‘తేజ్ ఐ లవ్యూ’కు సంబంధించిన విశేషాలన్నీ ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. సినిమాపై అంచనాలు పెంచుతున్నాయి. మరి తొలి సినిమా ‘తొలి ప్రేమ’ తర్వాత మళ్లీ ఆ స్థాయి సినిమా అందించడంలో విఫలమైన కరుణాకరన్.. ఈసారి ఆ రేంజ్ లో కాకపోయినా ‘డార్లింగ్’.. ‘ఉల్లాసంగా ఉత్సాహం’ స్థాయి సినిమా అయినా అందించి.. తేజును సక్సెస్ ట్రాక్ ఎక్కిస్తాడేమో చూడాలి. క్రియేటివ్ కమర్షియల్స్ బేనర్ మీద సీనియర్ ప్రొడ్యూసర్ కె.ఎస్.రామారావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.