Begin typing your search above and press return to search.

అమెరికా టూర్‌ రహస్యం వెళ్లడించిన తేజూ

By:  Tupaki Desk   |   25 March 2019 11:28 AM GMT
అమెరికా టూర్‌ రహస్యం వెళ్లడించిన తేజూ
X
మెగా మేనల్లుడు సాయి ధరమ్‌ తేజ్‌ త్వరలో 'చిత్రలహరి' చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్దం అవుతున్నాడు. ఈ చిత్రంకు ముందు తేజూ కాస్త గ్యాప్‌ తీసుకున్నాడు. వరుసగా ఆరు ఫ్లాప్‌ లు రావడంతో పాటు, కాస్త లావు అయిన కారణంగా తేజూ గ్యాప్‌ తీసుకున్నాడని అంతా భావించారు. మరి కొందరు తేజూ అమెరికా వెళ్లి లావు తగ్గేందుకు లైపో చేయించుకున్నాడు అంటూ వార్తలు వచ్చాయి. మరి కొందరు తేజూ జుట్టు ఊడిపోకుండా ట్రీట్‌ మెంట్‌ తీసుకునేందుకు అమెరికా వెళ్లాడని పుకార్లు పుట్టించారు.

తాజాగా తన అమెరికా టూర్‌ గురించి తేజూ ఫుల్‌ క్లారిటీ ఇచ్చాడు. నేను గ్యాప్‌ తీసుకోవడానికి, బరువు పెరగడానికి కారణం నా గాయం. 'విన్నర్‌' సమయంలో గుర్రపు స్వారీ నేర్చుకునే సమయంలో కింద పడ్డ విషయం తెల్సిందే. ఆ సమయంలో దెబ్బను లెక్క పెట్టకుండా 'జవాన్‌' సినిమాలో నటించాను. పెయిన్‌ కిల్లర్‌ ట్యాబ్లెట్స్‌ వాడుతూ నొప్పిని భరించి ఆ సినిమాను పూర్తి చేశాను. ఒకానొక సమయంలో కాళు కదపలేని పరిస్థితి వచ్చింది. మొదట కాలు నొప్పిని అమ్మకు తెలియకుండా జాగ్రత్త పడ్డాను. కాని అమ్మకు తెలియడంతో సినిమాలకు బ్రేక్‌ ఇచ్చి అమెరికా వెళ్లి ఆర్ధో పిజీషన్‌ వద్ద చికిత్స చేయించుకోవాల్సిందే అని పట్టుబట్టింది. అందుకే నేను తప్పనిసరి పరిస్థితుల్లో అమ్మ చెప్పినట్లుగా అమెరికా వెళ్లి చికిత్స చేయించుకున్నాను.

ఇప్పుడు నా కాలి గాయం పూర్తిగా నయం అయ్యింది. అయితే తన అమెరికా పర్యటన గురించి మీడియాలో మాత్రం రకరకాలుగా వార్తలు రావడం ఆశ్చర్యంగా అనిపించిందని చెప్పుకొచ్చాడు. చిత్రలహరి చిత్రంతో తేజూకు సక్సెస్‌ పడటం ఖాయం అని, ఇన్నాళ్లకు తేజూ ఒక మంచి సినిమాతో రాబోతున్నాడు అంటూ మెగా ఫ్యాన్స్‌ నమ్మకంగా ఉన్నారు. మరి వారి నమ్మకం ఏ మేరకు నిలుస్తుందనేది విడుదలైన తర్వాత క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.