Begin typing your search above and press return to search.

నాని చిత్రాలహరి షిఫ్ట్ అయ్యిందా?

By:  Tupaki Desk   |   22 Feb 2018 4:28 AM GMT
నాని చిత్రాలహరి షిఫ్ట్ అయ్యిందా?
X
చిత్ర పరిశ్రమలో ఒక సినిమా కథ ఎన్ని దారుల్లో ప్రయానిస్తుందో ఎవరికి తెలియదు. దాదాపు పట్టాలెక్కించేందుకు రెడీ చేస్తుండగా సడన్ గా మరో ట్రాక్ లోకి జంప్ చేస్తుంది. అంటే మరో హీరో దగ్గరికి వెళుతుందన్నమాట. ఆ విధంగా చాలా కథలు షిఫ్ట్ అవ్వడం కామన్. హిట్ అయితే లాక్కు లేదంటే బ్యాడ్ లక్. ఇక అసలు మ్యాటర్ లోకి వస్తే.. నాని తన కెరీర్ లో కొన్ని కథలను చాలా మిస్ చేసుకున్నాడు. అవి మంచి హిట్ అయ్యాయని కూడా నాని కొన్ని సందర్బాల్లో చెప్పాడు.

అయితే రీసెంట్ గా న్యాచురల్ స్టార్ ఆల్ రెడీ కొన్ని నెలల కింద ఒకే చేసిన ఒక ఎమోషనల్ లవ్ స్టోరీని వదిలేసుకున్నట్లు తెలుస్తోంది. నేను శైలజా దర్శకుడు కిషోర్ తిరుమల దర్శకత్వంలో నాని ఒక సినిమా చేయడానికి ఒప్పుకున్న సంగతి తెలిసిందే. చిత్రాలహరి అని టైటిల్ ని కూడా సెట్ చేశారు. అయితే ఆ సినిమా కథ ఇప్పుడు మరొక హీరోకి షిఫ్ట్ అయ్యిందని సమాచారం. నాని కథలో కొన్ని మార్పులు చేయమని అడగడంతో దర్శకుడు తన అక్షరాలను చేరిపేయడం ఇష్టం లేక నో అని చెప్పాడట. దీంతో నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ వారు సాయి ధరమ్ తేజ్ ని ఈ కథకు సెట్ చేశారని తెలుస్తోంది.

అయితే సాయి ధరమ్ తేజ్ గత సినిమాలను ఒకే చేసినట్టుగానే కిషోర్ తిరుమల చెప్పిన కొన్ని లైన్స్ కే గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. ఇక సినిమాను మరికొన్ని రోజుల్లో స్టార్ట్ చేసే విదంగా సాయి డేట్స్ ని సెట్ చేసుకుంటున్నాడట. ప్రస్తుతం ఈ హీరో కరుణాకరన్ దర్శకత్వంలో ఒక సినిమాను చేస్తున్నాడు. అలాగే గోపిచంద్ మలినేని దర్శకత్వంలో మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. అయితే కరుణాకరన్ సినిమాతో పాటు చిత్రలహరి కథను కూడా ఒకే సారి ఫినిష్ చేయాలని మెగా అల్లుడు ప్లాన్స్ వేసుకుంటున్నట్లు టాక్.