Begin typing your search above and press return to search.

మళ్ళీ మెగా రీమిక్స్ చేస్తున్నాడుగా

By:  Tupaki Desk   |   28 Dec 2017 5:45 PM IST
మళ్ళీ మెగా రీమిక్స్ చేస్తున్నాడుగా
X
పాత పాటలను ఈ మధ్య కాలంలో చాలా మంది రీమిక్స్ చేస్తున్న సంగతి తెలిసిందే. కొంత మంది సందర్భానుసారం వాడుకుంటుంటే.. మరికొంత మంది సెంటిమెంట్ కోసం రీమిక్స్ పాటలను చేస్తుంటారు. ఇక ఇప్పుడు అదే తరహాలో సినిమాలో సందర్భాన్ని బట్టి సెంటిమెంట్ తో మెగా మేనల్లుడు మరోసారి మెగాస్టార్ పాటను రీమిక్స్ చేస్తున్నాడు. గత కొంత కాలంగా ఈ మెగా హీరో అపజయాలతో సతమతమవుతోన్న సంగతి తెలిసిందే.

అయితే ఎలాగైనా ఈ సారి హిట్ కొట్టాలని చూస్తున్నాడు. అందుకు లక్కీగా వివి వినాయక్ దొరకడంతో బాక్స్ ఆఫీస్ ను టార్గెట్ గా పెట్టుకున్నాడు. ఈ సినిమాతోనే మార్కెట్ ను పెంచుకోవాలని చూస్తున్నాడు. దీంతో సెంటిమెంట్ ని కూడా ఫాలో అవుతున్నాడు. మెగాస్టార్ చిరంజీవి కొండవీటి దొంగ సినిమాలోని ఛమకు ఛమకు ఛామ్ అనే పాట ఎంతగా హిట్ అయ్యిందో అందరికి తెలిసిందే. ఇళయరాజా స్వరపరిచిన ఆ పాటకు విజయశాంతి తో చిరు వేసిన స్టెప్పులు చాలా పాపులర్ అయ్యాయి. ఇక ఇప్పుడు సాయి ధరమ్ తేజ్ కూడా ఆ పాటతో గుర్తింపు తెచ్చుకోవాలని చూస్తున్నాడు.

ఇంతకుముందు సుప్రీమ్ - సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ వంటి సినిమాలో చిరు పాటలను రీమిక్స్ చేసి హిట్టు కొట్టేశాడు. ఇప్పుడు ఈ క్రేజీ పాటను కూడా రీమిక్స్ చేయాలనీ డిసైడ్ అయ్యాడు. మరి సెంటిమెంట్ ఎంతవరకు వర్కౌట్ అవుతుందో చూడాలి.