Begin typing your search above and press return to search.

థియేట్రికల్ రిలీజ్ లను ప్రమోట్ చేస్తున్న సాయి తేజ్..!

By:  Tupaki Desk   |   12 Dec 2020 5:22 AM GMT
థియేట్రికల్ రిలీజ్ లను ప్రమోట్ చేస్తున్న సాయి తేజ్..!
X
కరోనా కారణంగా కొన్ని నెలల పాటు మూతబడిన థియేటర్లు ఇప్పుడిప్పుడే తెరుచుకుంటున్న విషయం తెలిసిందే. ఈ మధ్య 'టెనెట్' అనే హాలీవుడ్ చిత్రాన్ని థియేటర్స్ లో విడుదల చేస్తే ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ థియేటర్స్ లో సినిమాలను ప్రమోట్ చేస్తూ ఓ వీడియో పోస్ట్ చేసాడు. ఈ వీడియోలో 'థియేటర్లను చూడటం చాలా ఆనందంగా ఉంది. పెద్ద తెరపై సినిమాను చూసే అనుభవాన్ని మళ్లీ పొందడం ఇంకా కొత్తగా ఉంది. దాదాపు అందరూ అదే విధంగా ఫీల్ అవుతున్నారు. ఈనాటి నుంచి మళ్లీ సినిమాల విడుదలను వేడుకగా జరుపుకుందాం' అని మాట్లాడుతూ థియేటర్స్ లో సినిమా చూడటానికి ప్రేక్షకులను ఆహ్వానించాడు.

అలానే స్టార్ హీరోలందరూ థియేట్రికల్ రిలీజ్ కి వెనకాడుతుంటే తాను నటించిన 'సోలో బ్ర‌తుకే సో బెట‌ర్' సినిమాను కూడా థియేట‌ర్స్ లో రిలీజ్ చేసేందుకు ముందుకు వ‌చ్చాడు సాయి తేజ్. ఈ చిత్రాన్ని క్రిష్మస్ కానుకగా డిసెంబ‌ర్ 25న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నాడు. లాక్ డౌన్ తర్వాత థియేట‌ర్స్ లో డైరెక్ట్ రిలీజ్ అవుతున్న మొట్ట‌మొద‌టి క్రేజీ సినిమా ఇదే అవుతుందని చెప్పవచ్చు. సుబ్బు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్‌‌ పై బీవీఎస్ఎన్‌ ప్రసాద్ నిర్మించాడు. అయితే ఈ సినిమాను జీ స్టూడియోస్ వారు డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ చేయ‌డానికి కొనుకున్న‌ప్ప‌టికీ ప్ర‌స్తుతం థియేట‌ర్స్ తెరిచే అవ‌కాశం ఉండ‌టంతో ఈ సినిమాను థియేట్రికల్ రిలీజ్ చేస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలతో ఈ సినిమాపై పాజిటివ్ బజ్ క్రియేట్ అయింది. 'చిత్రలహరి' 'ప్రతిరోజూ పండుగే' వంటి వరుస హిట్స్ అందుకున్న మెగా మేనల్లుడు 'సోలో బ్రతుకే సో బెటర్' సినిమాతో హ్యాట్రిక్ హిట్ అందుకుంటుడేమో చూడాలి.


వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి : https://www.instagram.com/p/CIXGdnkJSKR/