Begin typing your search above and press return to search.

రియాలిటీ చూపించేస్తున్న మెగా హీరో

By:  Tupaki Desk   |   13 April 2017 11:33 AM IST
రియాలిటీ చూపించేస్తున్న మెగా హీరో
X
మెగా హీరోల్లో ఎవరూ చేయని ఓ ప్రయత్నాన్ని సాయి ధరం తేజ్ చేస్తున్నాడు. వెబ్ మీడియా విస్తృతం అయిపోయిన ఈ రోజుల్లో.. వెబ్ సిరీస్ లు విపరీతంగా పెరిగిపోయాయి. వాటికి ఆదరణ కూడా అదే స్థాయిలో దక్కుతోంది. తేజు ఇప్పుడు 'నేను మీ కళ్యాణ్' అనే వెబ్ సిరీస్ లో యాక్ట్ చేస్తున్నాడు.

ఈ వెబ్ సిరీస్ లో తేజు చేస్తున్నది తన పాత్రే కావడం విశేషం. 'నాకు ఇది కొత్త ఎక్స్ పీరియన్స్. అలాగే నా పాత్రనే నేను చేస్తుండడం మరో కొత్త అనుభూతిని ఇస్తోంది. సహజంగా యాక్టింగ్ చేసేటపుడు మన ఒరిజినాలిటీని దాచుకుని నటించాల్సి ఉంటుంది. కానీ నా రియల్ లైఫ్ కేరక్టర్ నే ఇందులో చేస్తుండడంతో.. ప్రపంచానికి మనలోని రియాలిటీని ప్రదర్శించే అవకాశం దక్కుతుంది. మనల్ని మనం మరింతగా ఎక్స్ పోజ్ చేసుకోవడానికి ఇలాంటి కేరక్టర్స్ ఉపయోగపడతాయి' అంటున్నాడు తేజు.

ఇప్పటికే ఫస్ట్ ఎపిసోడ్ కి మంచి రెస్పాన్స్ వచ్చిందన్న తేజు.. మిగిలిన భాగాలను కూడా ఈ స్థాయిలోనే ఆదరిస్తారని కోరుకుంటున్నట్లు చెబుతున్నాడు. నిజమైన ప్రేమ కోసం రేడియో జాకీ కళ్యాణ్ వెతుక్కోవడమే ఈ నేను మీ కళ్యాణ్ స్టోరీ. కుటుంబ సభ్యుల సాన్నిహిత్యం.. మంచి ఉద్యోగం అన్నీ ఉన్న ఈ పాత్రకు.. ప్రేమ ఒక్కటి మిస్ అయిన ఫీలింగ్ ఉంటుంది. దర్శకుడు కళ్యాణ్ శంకర్ ఈ వెబ్ సిరీస్ ని తీర్చిదిద్దుతున్న తీరు అందరినీ ఆకట్టుకుంటోంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/