Begin typing your search above and press return to search.

మామ డైలాగ్ వ‌ర్క‌వుట్ అవుతుందా సాయి?

By:  Tupaki Desk   |   13 Jun 2016 9:30 AM GMT
మామ డైలాగ్ వ‌ర్క‌వుట్ అవుతుందా సాయి?
X
త‌న మామ‌ల‌ను వ‌రుస‌బెట్టి వాడేస్తున్నాడు మెగా యంగ్ హీరో సాయి ధ‌ర‌మ్ తేజ్. సినిమాల్లో మెగాస్టార్ ను గానీ... ప‌వ‌న్ క‌ళ్యాణ్ ను గానీ.. అనుక‌రించ‌డంలో మిగ‌తా మెగా హీరోల్లోకంటే సాయిధ‌ర‌మ్ తేజే ముందుంటున్నాడు. త‌న మొద‌టి సినిమా పిల్లా నువ్వులేని జీవితం మొద‌లు కొని.. మొన్న విడుద‌లైన సుప్రీమ్ వ‌ర‌కు ఏదో రూపంలో వారికి సంబంధించిన టైటిల్సే. తాజాగా మెగాస్టార్ కు ఒక్క‌ప్పుడున్న సుప్రీమ్ టైటిల్ ను కూడా త‌న సినిమాకు వాడేసి విజ‌యం సాధించాడు. ఇప్పుడు మ‌రోసారి త‌న చిన మావయ్య ప‌వ‌న్ డైలాగ్... నాకు తిక్కుంది దానికి ఓ లెక్కుంది.. అనే డైలాగులో తిక్కను మాత్ర‌మే తీసుకుని మ‌న‌ ముందుకు రావ‌డానికి సిద్ధ‌మ‌వుతున్నాడు.

పిల్లా నువ్వులేని జీవితం.. సుబ్ర‌మ‌ణ్యం ఫ‌ర్ సేల్... సుప్రీమ్ సినిమాల‌తో మినిమ‌మ్ గ్యారెంటీ హీరోగా మారిపోయిన సాయిధ‌ర‌మ్ తేజ్.. ఇక నుంచి వ‌రుస‌గా సినిమాలు చేసేసే పనిలో వున్నాడు. మూడు సినిమాలు వ‌రుస‌గా హిట్ కావ‌డంతో.. మాస్ రాజా ప్లేస్ ను సాయి ఆక్ర‌మించేశాడ‌నే టాక్ ఇప్ప‌టికే ఇండ‌స్ట్రీలో విన‌బ‌డుతోంది. ఇక ఇలాగే త‌న విజ‌యాల‌ను పెంచుకుంటూ పోతే... యంగ్ హీరోల్లో మాత్రం మంచి క్రేజ్ సంపాదించుకుంటాడ‌న‌టంలో సందేహం లేదు.

ప్ర‌స్తుతం సునీల్ రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో తిక్క మూవీలో న‌టిస్తున్నాడు. లారిస్సాబోన్సి - మ‌న్నార్ చోప్రా అత‌ని స‌ర‌స‌న‌ న‌టిస్తున్నారు. డాక్ట‌ర్ సి.రోహిన్ రెడ్డి నిర్మాత‌. రొమాంటిక్ ఎంట‌ర్టైన‌ర్ గా రూపొందుతున్న ఈ చిత్రం మూడు పాట‌లు మిన‌హా మిగ‌తా టాకీ పార్ట్ మొత్తం పూర్త‌యింది. ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు జ‌రుపుకొంటోంది. మిగిలిన మూడు పాట‌ల‌ను ఈనెలలో పూర్తిచేసి... జులైలో సినిమాను ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురావ‌డానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ చిత్రానికి థ‌మ‌న్ సంగీతం అందిస్తున్నాడు. మ‌రి మామ డైలాగును త‌న సినిమాకు టైటిల్ గా పెట్టుకున్న సాయి.. తిక్క ఏమాత్రం చూపిస్తాడో చూడాలి.