Begin typing your search above and press return to search.

ఎఫైర్స్ పై మెగా క్లారిటీ ఇచ్చిండు!!

By:  Tupaki Desk   |   25 May 2016 10:30 PM GMT
ఎఫైర్స్ పై మెగా క్లారిటీ ఇచ్చిండు!!
X
సాధారణంగా ప్రతీ హీరో మీద ఏదో ఓ రూమర్ వస్తూనే ఉంటుంది. అవి పుట్టించిన వాళ్లు ఎందుకలా చేస్తారో చెప్పడం కష్టమే కానీ.. వీటిని డీల్ చేయడంలో మెగా ఫ్యామిలీకి స్పెషల్ రూట్ ఉంది. అదేంటంటే.. ఎన్ని రకాల కామెంట్స్ వచ్చినా అసలు రియాక్ట్ కాకపోవడమే.

మొదట్లో రామ్ చరణ్ కాస్త స్పందించేవాడు. మెల్లగా తను కూడా ఆ రూట్ లోకి వచ్చేశాడు. రీసెంట్ గా చెప్పను బ్రదర్ అంటూ బన్నీ మాట్లాడింది కూడా ఇంటర్నల్ మేటరే. అయితే.. ఇప్పుడున్న కుర్ర హీరోల్లో సుప్రీమ్ హీరో అనిపించుకుంటున్నాడు సాయిధరం తేజ్. వరుసగా రెండు సూపర్ హిట్స్ కొట్టిన ఉత్సాహం కూడా కుర్రాడిలో కనిపిస్తోంది. కానీ ఈ మెగా మేనల్లుడికి.. అఫైర్స్ పేరుతో చాలానే రూమర్స్ వచ్చాయి. వాటిపై ఈ సుప్రీమ్ ఇచ్చిన ఆన్సర్ వింటే మైండ్ బ్లాంక్ అవాల్సిందే.

'ఇలాంటి వాటిపై రియాక్ట్ అయితే.. మనల్ని డిస్టర్బ్ చేసినందుకు వాళ్లు చాలా సంతోషిస్తారు. వాటిని పట్టించుకోకపోతే.. వీటిని కేర్ చేయలేదనే సంతృప్తి ఉంటుంది. పేపర్లు నింపుకోవడానికి రకరకాలుగా రాస్తుంటారు. నేనిక్కడకి పని చేయడానికి వచ్చాను. నన్ను డిస్టర్బ్ చేసే వాళ్ల కోసం కాదు' అంటూ సుబ్రమణ్యం ఫర్ సేల్ మూవీలో పంచ్ ని తిరగరాసి మరీ వేశాడు సాయిధరం తేజ్. ఇలా రూమర్స్ ని హ్యాండిల్ చేసే విషయంలో తేజు స్ట్రాటజీ సూపర్ అనే మాట వినిపిస్తోంది.