Begin typing your search above and press return to search.

మొత్తానికి కథ పట్టాలెక్కేసింది

By:  Tupaki Desk   |   29 March 2018 5:00 AM IST
మొత్తానికి కథ పట్టాలెక్కేసింది
X
ప్రేమ కథలను తెరకెక్కించడంలో కరుణాకరన్ శైలి చాలా డిఫెరెంట్ గా ఉంటుందనే చెప్పాలి. ఎన్ని సినిమాలు చేసినా అందులో ప్రేమికుడి పాత్ర ఒకే విధంగా ఉంటుంది. పైగా హీరో హీరోయిన్ మధ్య సరదా సన్నివేశాలను ఈ డైరెక్టర్ డిజైన్ చేసినట్లుగా ఎవరు డిజైన్ చేయలేరు. ముఖ్యంగా హీరో పాత్ర చాలా ఫన్నీగా ఉండడం తొలి ప్రేమ నుంచి చూస్తూనే ఉన్నాం. అదే విధంగా ఫ్యామిలీ ఎమోషన్స్ ని కూడా ఇతను చక్కగా హ్యాండిల్ చేస్తాడని పేరుంది.

అయితే కరుణాకరన్ గత కొంత కాలంగా పెద్దగా హిట్స్ అందుకోవడం లేదు. చివరగా 2010లో ప్రభాస్ తో చేసిన డార్లింగ్ తప్ప మరో హిట్టు లేదు. ఎందుకంటే ప్రేమంట - చిన్నదాన నీకోసం వరుసగా అతని సక్సెస్ వాల్యుని తగ్గించాయి. ఇక ఈ సారి అలా కాకూడదని దర్శకుడు సరికొత్త ప్రేమ కథతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. సాయి ధరమ్ తేజ్ తో చేస్తోన్న సినిమా మొన్నటి వరకు పెండింగ్ లో పడినట్లు అనిపించినా రీసెంట్ గా సెట్స్ పైకి వెళ్లింది.

అందుకు సంబందించిన పోటోలను కూడా చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. సినిమా నటులను చూస్తుంటే మళ్లీ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ని ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రేమ సన్నివేశాలతో పాటు తన మార్క్ కామెడీ కూడా ఉండేలా చూసుకుంటున్నాడట. ఇక సాయి ధరమ్ తేజ్ కూడా విజయాన్ని చూసి చాలా కాలమవుతోంది. దర్శకుడికి హీరోకి ఈ సినిమా చాలా అవసరం. ఇక సాయి ధరమ్ తేజ్ సరసన అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటిస్తోన్న సంగతి తెలిసిందే.