Begin typing your search above and press return to search.

సోలో బ‌ర్త్ డే పోస్ట‌ర్: బంతాట ఆడే విద్యార్థి కం ప్రేమికుడి క‌థ‌!

By:  Tupaki Desk   |   15 Oct 2020 9:30 AM IST
సోలో బ‌ర్త్ డే పోస్ట‌ర్: బంతాట ఆడే విద్యార్థి కం ప్రేమికుడి క‌థ‌!
X
సుప్రీంహీరో సాయి తేజ్ న‌టిస్తున్న తాజా చిత్రం `సోలో బ్రతుకే సో బెటర్` నుండి రెండు చార్ట్ ‌బస్టర్ లు విడుదల చేసిన సంగ‌తి తెలిసిందే. త‌దుప‌రి మంగళవారం మరో పాట‌ను విడుదల చేయ‌నున్నారు. ఈ పాట మెగా అభిమానులందరికీ ఎంతో ప్రత్యేకమైనదని టీమ్ ప్ర‌క‌టించింది. ప‌వ‌న్ క‌ల్యాణ్ `తొలి ప్రేమ` నుండి స్పెష‌ల్ సాంగ్ `గగనానికి ఉదయం ఒక‌టే...` తిరిగి మెగా ఫ్యాన్స్ గుండెల్ని తాక‌నుంద‌ని రివీలైంది. ఈ రీమిక్స్ అభిమానుల్లోకి దూసుకెళుతుంద‌ని భావిస్తున్నారు.

గగనానికి ఉదయం ఓకాటే.. పాట‌ను దివంగ‌త ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పాడ‌టం ఇక్క‌డ ఆస‌క్తిక‌ర విష‌యం. తొలి ప్రేమ‌లోనూ ఆయ‌నే ఆల‌పించారు. ఇప్పటికీ అభిమానుల గుండెల్లో ఆ క్లాసిక్ మార్మోగుతూనే ఉంది. ప్ర‌స్తుతం థ‌మ‌న్ ఈ పాట‌కు ట్యూన్ సిద్ధం చేశారు. ఇక ఇందులో న‌భా నటేష్ లుక్ కూడా ఇంత‌కుముందు రిలీజైంది. న‌భా ఓ కాలేజ్ గాళ్ పాత్ర‌లో క‌నిపించ‌నుంది.

సోలో బ్రాతుకే సో బెటర్ చిత్రీకరణ ఇటీవల ముగిసింది.సుబ్బూ ఈ చిత్రంతో దర్శకుడిగా ప‌రిచ‌యం అవుతున్న సంగ‌తి తెలిసిందే. సాయి ధరం తేజ్ కాలేజ్ లో ఒక గ్యాంగ్ కి నాయకత్వం వహించే విద్యార్థి నాయ‌కుడి పాత్రను పోషించ‌డం ఆస‌క్తిక‌రం. సాయి తేజ్ - న‌భా కాలేజ్ ల‌వ్ స్టోరీలో ఎలాంటి ట్రీట్ ఇస్తారు అన్న‌ది తెర‌పై చూడాలి. నేడు సాయి తేజ్ బ‌ర్త్ డే సంద‌ర్భంగా సోలో బ్ర‌తుకే టీమ్ అత‌డికి బ‌ర్త్ డే శుభాకాంక్ష‌లు అందించింది. హ్యాపి బ‌ర్త్ డే సుప్రీం హీరో సాయితేజ్ అంటూ శుభాకాంక్ష‌లు తెలిపింది. ఈ సంద‌ర్భంగా రిలీజ్ చేసిన పోస్ట‌ర్ లో సాయి తేజ్ స్టైలిష్ కాలేజ్ బోయ్ గా కనిపించాడు. చేతిలో కాస్కో వాలీ బాల్ క‌నిపిస్తోంది. విజ‌య బాపినీడు స‌మ‌ర్ప‌ణ‌లో ఈ చిత్రాన్ని బీవీఎస్.ఎన్ ప్ర‌సాద్ నిర్మిస్తున్నారు.