Begin typing your search above and press return to search.

ఓరుగల్లు ఉత్సవానికి విన్నర్ ప్రచారం

By:  Tupaki Desk   |   23 Feb 2017 1:46 PM IST
ఓరుగల్లు ఉత్సవానికి విన్నర్ ప్రచారం
X
మెగా హీరో సాయిధరం తేజ్ లేటెస్ట్ మూవీ విన్నర్ రేపే థియేటర్లలోకి వచ్చేస్తోంది. ఇప్పటికే పబ్లిసిటీ యాక్టివిటీస్ లో మాంచి జోరు మీదున్నాడు సుప్రీమ్ స్టార్. ఇప్పుడు తన సినిమాతో పాటే ఓరుగల్లు ఉత్సవానికి కూడా తన వంతుగా ప్రచారం చేసి పెడుతున్నాడు తేజు.

ఓరుగల్లు ఉత్సవ్ ఫెస్టివల్- 2017ను ఏప్రిల్ 9న నిర్వహించబోతున్నారు. ఇక్కడి జవహర్ లాల్ నెహ్రూ స్టేడియంలో ఈ కార్యక్రమం జరగనుంది. ఈ కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్ ను లాంఛ్ చేసేందుకు.. హనుమకొండలోని కిషన్ పురాలోని సిఐటిస్ కాలేజ్ కి విచ్చేశాడు తేజ్. సంగీత దర్శకుడు ఎస్ఎస్ థమన్.. దర్శకుడు గోపీచంద్ మలినేని.. నిర్మాత నల్లమలుపు బుజ్జి కూడా ఈ లోగో లాంఛ్ కార్యక్రమంలో పాల్గొన్నారు. 'హాయ్ వరంగల్.. ఓరుగల్లు ఫెస్ట్ కి సిద్ధం కండి. అలాగే నా సినిమా విన్నర్ ని కూడా చూసేసి.. జీవితంలో విజేతగా ఎలా నిలవాలో తెలుసుకోండి' అని చెప్పాడు సాయిధరం తేజ్.

మెగా హీరో రాకతో సీఐటీఎస్ కాలేజ్ ప్రాంగణమంతా అభిమానులతో నిండిపోయింది. కుర్ర హీరో క్రేజ్ ఏ రేంజ్ లో ఉందో.. ఈ ఓరుగల్లు ఉత్సవ్ లోగో లాంఛ్ కార్యక్రమం చాటి చెప్పింది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/