Begin typing your search above and press return to search.

పవర్ స్టార్ కు జవాన్ టీజర్ విషెస్

By:  Tupaki Desk   |   3 Sept 2017 9:49 AM IST
పవర్ స్టార్ కు జవాన్ టీజర్ విషెస్
X
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బర్త్ డే సందర్భంగా ఆయన అభిమానుల్లో జోష్ నింపేలా కాన్సెప్ట్ పోస్టర్ రిలీజ్ చేశారు ఫిలిం మేకర్స్. దీంతోపాటు ఇదే సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్న కీర్తి సురేష్ ఓ లైవ్లీ ఫొటో షేర్ చేసి అభిమానులను ఇంకాస్త సంతోషపరిచింది. మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ ఓ సాంగ్ టీజర్ రిలీజ్ చేశాడు.

వీటన్నింటికి తోడుగా మెగా ఫ్యామిలీలోని సాయి ధరమ్ తేజ్ తన లేటెస్ట్ ఫిలిం జవాన్ సినిమా టీజర్ ను పవన్ కళ్యాణ్ బర్త్ డే సందర్భంగా రిలీజ్ చేశాడు. హ్యాపీ బర్త్ డే టు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటూ సాయి ధరమ్ సెల్యూట్ చేస్తున్న స్టిల్ తో ఈ టీజర్ ఎండ్ చేశారు. బి.వి.ఎస్.రవి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీలో బ్యాక్ గ్రౌండ్ గా వచ్చే పాటతో టీజర్ కట్ చేశారు. ‘ఇంటికి ఒక్కడు కావాలి. జంగ్ కి సై అని దూకాలి. కంటికి రెప్పలే కాయాలి. బన్ జారే తూ జవాన్’ అంటూ సాగిన ఈ పాట చాలా ఇన్ స్పిరేషన్ ల్ గా ఉంది. పోలీస్ క్యారెక్టర్ లో కనిపిస్తున్నందున సాయి ధరమ్ ఫిట్ నెస్ విషయంలోనూ చాలా కేర్ తీసుకున్నట్లే కనిపిస్తోంది. ఈ పాటకు తమన్ మ్యూజిక్ కూడా ఆకట్టుకునేలా ఉంది.

దిల్ రాజు సమర్పణలో కృష్ణ నిర్మాతగా వ్యవహరిస్తున్న జవాన్ చిత్రంలో కృష్ణగాడి వీరప్రేమగాథ ఫేం మెహ్రీన్ పిర్జాదా హీరోయిన్ గా నటిస్తోంది. తిక్క - విన్నర్ బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టిన నేపథ్యంలో సాయి ధరమ్ జవాన్ పై చాలా ఆశలే పెట్టుకున్నాడు. దానికితోడు లేటెస్ట్ గా కృష్ణవంశీ డైరెక్షన్ లో నక్షత్రం సినిమాలో స్పెషల్ అప్పియరెన్స్ చేశాడు. ఈ సినిమా థియేటర్ల నుంచి వారం రోజుల్లోనే వెనక్కి వెళ్లిపోవడంతో ఎంతో గొప్పగా ఎలివేట్ అవుతుందనుకున్న ఈ క్యారెక్టర్ కు పెద్దగా గుర్తింపు రాకుండా పోయింది. ఇప్పుడు జవాన్ టీజర్ చూస్తుంటే అతడి ఆశలు నిలబెట్టేలానే ఉంది. దానికితోడు పవన్ కళ్యాణ్ అభిమానులను బాగానే ఇంప్రెస్ చేశాడు కాబట్టి సినిమా బాగుంటే సునాయాసంగానే హిట్టవుతుంది.