Begin typing your search above and press return to search.

జవాన్ స్టోరీ ఇదే!

By:  Tupaki Desk   |   1 Sep 2017 8:58 AM GMT
జవాన్ స్టోరీ ఇదే!
X
ఎలాగైనా మరో బ్లాక్ బస్టర్ కొట్టేందుకు మెగా కాంపౌండ్ హీరో సాయిధరమ్ తేజ్ ప్రయత్నిస్తున్నాడు. తిక్క, విన్నర్ తో వరుస ఫ్లాపులు తిన్న సాయిధరమ్ ఇప్పుడు తన అప్ కమింగ్ మూవీ జవాన్ పై కాన్సన్ ట్రేట్ చేస్తున్నాడు. బి.వి.ఎస్.రవి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా నిజానికి సెప్టేంబర్ లో విడుదల కావాలి కానీ వాయిదా పడింది. ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఈ సినిమా వాయిదాకి కారణం అని వార్తలు వస్తున్నాయి. దిల్ రాజు వద్దనడంతోనే జవాన్ దర్శకనిర్మాతలు సినిమా రిలీజ్ ని పోస్ట్ పోన్ చేసినట్లుగా సమాచారం. అయితే ఇటీవలే విడుదలైన జవాన్ టీజర్ కు సోషల్ మీడియాలో అనూహ్యమైన రెస్పాన్స్ వచ్చింది. స్టైలిష్ లుక్స్ తో సాయిధరమ్ మెగా ఫ్యాన్స్ ని ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు. దీంతో ఈ సినిమా విడుదల వాయిదా పడినా ఫ్యాన్స్ అప్ సెట్ కాకుండా రిలీజ్ కోసం ఎదురుచూస్తున్నట్లుగా చిత్ర వర్గాలు చెబుతున్నాయి.

అయితే ఈ సినిమా స్టోరీ ఇదేనంటూ ఓ వార్త ప్రస్తుతం ఫిల్మ్ నగర్ లో షికార్లు కొడుతుంది. ఫ్రెండ్ షిప్ బ్యాక్ డ్రాప్ తో ఈ సినిమా తెరకెక్కుందుని, సాయిధరమ్ తో పాటు సరిసమానంగా ఉండే ఓ స్నేహితుడి పాత్ర ఈ కథలో ఉంటుందని, ఆ క్యారెక్టర్ లో ఓ అప్ కమింగ్ హీరో నటిస్తున్నాడని, సాయిధరమ్ అత్యంత సన్నిహితుడైన ఆ హీరో కెరీర్ కి ఈ క్యారెక్టర్ చాలా ప్లస్ అవుతుందని టాక్ నడుస్తుంది. అంతేకాదు ఇంటర్వెల్ టైమ్ కి ఆ ఫ్రెండ్ క్యారెక్టర్ ఓ ట్విస్ట్ ఇస్తాడని, చివరకు ఆ స్నేహితుడే హీరోకి విలన్ గా మారతాడని ఇదే జవాన్ లో ఇంట్రెస్టింగ్ పాయింట్ అని సినీ జనాలు అంటున్నారు. మరి ఈ కథలో నిజం ఎంత ఉందో తెలియదు కానీ ఫ్రెండ్ షిప్ బ్యాక్ డ్రాప్ లో ఓ కమర్షీయల్ సినిమా వచ్చి చాలా కాలం అయింది. మరి జవాన్ తో మళ్లీ టాలీవుడ్ లో స్నేహకథా చిత్రాలు ఊపందుకుంటాయో చూడాలి.