Begin typing your search above and press return to search.

జవాన్ వెనకడుగు వేసినట్లేనా?

By:  Tupaki Desk   |   31 Aug 2017 7:27 AM GMT
జవాన్ వెనకడుగు వేసినట్లేనా?
X
మెగా హీరో సాయి ధరం తేజ్ ఇప్పుడు ఎలాగైనా హిట్ కొట్టాలనే తపనతో ఉన్నాడు. కెరీర్ స్టార్టింగ్ లోనే మంచి సక్సెస్ లు అందుకున్న ఈ యంగ్ హీరో.. సుప్రీమ్ తో బ్లాక్ బస్టర్ కూడా తన ఖాతాలో వేసుకున్నాడు. అయితే.. తిక్క మూవీ నుంచి ఇతడికి బ్యాడ్ టైం స్టార్ట్ అవగా.. విన్నర్ అనే మూవీ చేసినా విన్నర్ గా నిలవలేకపోయాడు.

అయితే.. ఇప్పుడు జవాన్ అంటూ ముందు నుంచే ఇంట్రెస్ట్ కలిగిస్తున్న ఓ ప్రాజెక్ట్ చేస్తున్న తేజు.. ఇప్పటికే ఈ చిత్రాన్ని పూర్తి చేసేశాడు. రైటర్ నుంచి డైరెక్టర్ గా మారిన బీవీఎస్ రవి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం ఫస్ట్ లుక్.. పోస్టర్స్.. టీజర్ అన్నీ ఆకట్టుుకున్నాయి. అయితే.. సాయి ధరం తేజ్ ఈ మూవీ రిలీజ్ కోసం ఎంతగా ఎదురుచూస్తున్నా.. ఈ చిత్రం విడుదల వాయిదా పడ్డం ఖాయంగా కనిపిస్తోంది. నిజానికి జవాన్ ను సెప్టెంబర్ మొదటి వారంలోనే విడుదల చేయాలన్నది హీరో.. డైరెక్టర్.. ప్రొడ్యూసర్ ల ఆలోచన. కానీ ఇప్పుడు ఆ ప్రతిపాదన వాయిదా వేసుకున్నట్లుగా తెలుస్తోంది.

సెప్టెంబర్ 1న నందమూరి బాలకృష్ణ పైసా వసూల్ విడుదల కానుండగా.. సెప్టెంబర్ 21 ఎన్టీఆర్ మూవీ జై లవ కుశ వస్తోంది. ఆ వెంటనే స్పైడర్ కూడా విడుదల కానుంది. ఈ మధ్యలో సినిమా రిలీజ్ చేసినా.. రెండు వారాలు తిరక్కుండానే థియేటర్లు ఖాళీ చేసే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. దీపావళి బెర్తులను కూడా ఇప్పటికే నాగార్జున రాజుగారి గది2.. రవితేజ రాజా ది గ్రేట్.. గోపీచంద్ ఆక్సిజన్ లు బుక్ చేసేసుకున్నాయి. అందుకే జవాన్ ను నవంబర్ వరకూ పోస్ట్ పోన్ చేసేసుకున్నారని అంటున్నారు. హిట్టు కోసం తేజు అప్పటివరకూ ఆగక తప్పేట్లుగా లేదు.