Begin typing your search above and press return to search.

జవాన్ జంప్ చేసేశాడే!!

By:  Tupaki Desk   |   14 Aug 2017 12:09 PM GMT
జవాన్ జంప్ చేసేశాడే!!
X
మెగా ఫ్యామిలిలో ఉన్న హీరోలు ప్రతి ఒక్కరు వారి వారి స్థాయిలో హిట్ అందుకొని సొంతంగా వారికంటూ ఓ మార్కెట్ ను సెట్ చేసుకున్నారు. కానీ మెగా మేనల్లుడు మాత్రం ఇంకా సరిగ్గా సెట్టవ్వలేదు. ఈ ప్రయత్నంలో కొన్ని అపజయాలు ఎదురైనా ఏ మాత్రం బెదరడం లేదు సాయి ధరమ్ తేజ్. తన ప్రతి సినిమాలో ఎదో రకంగా ప్రేక్షకులను అలరించే ప్రయత్నం చేస్తున్నాడు.

కెరీర్ మొదట్లో మంచి హిట్స్ అందుకున్న సాయి ఈ మధ్య కాలంలో హిట్ అందుకోలేదు. రీసెంట్ గెస్ట్ రోల్ తో అలరించిన నక్షత్రం సినిమా ప్లాప్ తో కొంత నిరాశ చెందాడు. దీంతో కొడితే గట్టిగా బాక్స్ ఆఫీస్ నే కొట్టాలని ఓ మంచి సైనికుడి కథతో రాబోతున్నాడు. రచయిత బివిఎస్ రవి తో జవాన్ అనే సినిమాతో వస్తున్నాడు. ఈ సినిమా సెప్టెంబర్ 1న బాలయ్య పైసా వసూల్ తో పోటీగా వస్తోందని మొన్నటివరకు టాక్ వచ్చింది. కాని ఇప్పుడు మాత్రం నవంబర్ నెలలో రాబోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే టీజర్ - ఫస్ట్ లుక్స్ తో చిత్రం ఆసక్తిని రేపుతోంది. అయితే ప్రస్తుతం కొన్ని పోస్ట్-ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉండడం వల్ల కరెక్ట్ డేట్ కి ఫిక్స్ చేయలేకపోతున్నారట. దీంతో నవంబర్ 1 లేదా 8న రాబోతున్నట్లు తెలుస్తోంది.

మంచి కథాంశంతో వస్తున్న ఈ చిత్రంలో సాయి ధరమ్ తేజ్ సరసన "కృష్ణ గాడి వీర ప్రేమగాధ" మెహ్రిన్ పిర్జాదా హీరయిన్ గా నటిస్తోంది. ఇక దిల్ రాజు సమర్పణలో కృష్ణ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా థమన్ సంగీతాన్ని అందిస్తున్నాడు. ఎన్నో హిట్ సినిమాలకు మాటలను అందించిన ఈ చిత్ర దర్శకుడు బివిఎస్ రవి రైటర్ గా సక్సెస్ అయినా దర్శకుడిగా సక్సెస్ కాలేకపోయాడు. 2011లో గోపీచంద్ తో తెరకెక్కించిన "వాంటెడ్" మూవీ ప్లాప్ తో మళ్లీ దర్శకత్వం వైపు చూడని రవి ఇప్పుడు "జవాన్" సినిమాతో అయినా మెప్పిస్తాడో లేదో చూడాలి.