Begin typing your search above and press return to search.

ఆ ప్రాజెక్ట్ లేదా తేజు!

By:  Tupaki Desk   |   13 July 2018 4:56 AM GMT
ఆ ప్రాజెక్ట్ లేదా తేజు!
X
ఊహించని విధంగా తేజ్ ఐ లవ్ యు ఇచ్చిన షాక్ తో సాయి ధరమ్ తేజ్ తో పాటు అభిమానులు కూడా బాగా నిరాశ చెందారు. కనీసం యావరేజ్ అనే మార్క్ అందుకున్నా వచ్చే సినిమాకు ప్లస్ అయ్యేది. కానీ ఆరు వరస డిజాస్టర్లు ఇచ్చిన హీరోగా సుప్రీమ్ హీరో మార్కెట్ బాగా డౌన్ అయ్యింది. ప్రస్తుతం కిషోర్ తిరుమల దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన తేజు దాని షూటింగ్ ఇంకా ప్రారంభించాల్సి ఉంది. చిత్రలహరి బార్ అండ్ రెస్టారెంట్ అనే టైటిల్ పరిశీలనలో ఉంది. స్క్రిప్ట్ పనులు ఫైనల్ స్టేజిలో ఉన్నాయని సమాచారం. కానీ దీన్ని ఓకే చేయడానికి ముందు తనతో విన్నర్ తీసిన దర్శకుడు గోపిచంద్ మలినేనితో మరో సినిమా చేయబోతున్నట్టు గతంలోనే ప్రకటించాడు తేజు. ఆ మేరకు అప్పుడు మీడియాలో తేజు బర్త్ డే సందర్భంగా యాడ్స్ కూడా ఇచ్చారు. కానీ ఇప్పుడు దాని గురించి ఎటువంటి అప్ డేట్ బయటికి రావడం లేదు.

విశ్వసనీయ సమాచారం మేరకు గోపిచంద్ మలినేని ప్రాజెక్ట్ ఇప్పట్లో తెరకెక్కే ఛాన్స్ లేదట. తేజు దీని గురించి ఎక్కడా మాట్లాడకపోవడం గోపిచంద్ మలినేని అసలు బయటే కనిపించకపోవడం అనుమానాలకు బలం చేకూరుస్తోంది. పూర్తిగా డ్రాప్ అవుతారా లేదా వాయిదా వేస్తారా అని తెలియాల్సి ఉంది. దీని సంగతి ఏమో కాని తేజు కోసం గోపాల్ అనే కొత్త దర్శకుడితో భగవద్గీత సాక్షిగా అనే వర్కింగ్ టైటిల్ తో టాగోర్ మధు స్క్రిప్ట్ వర్క్ చేయిస్తున్నట్టు తెలిసింది. ఫైనల్ అయితే మైత్రి సంస్థ మూవీతో పాటు ఇది కూడా లైన్ లో పెడతాడు తేజు. చేసేది ఎవరితో అయినా ఓ రేంజ్ బ్లాక్ బస్టర్ పడితే కానీ సాయి ధరమ్ తేజ్ పరిస్థితి మెరుగు పడేలా లేదు. అందుకే ఈ రెండు స్క్రిప్ట్ లను చాలా జాగ్రత్తగా వడబోస్తున్నట్టు తెలిసింది. ఠాగూర్ మధు సినిమాను బెజవాడ బ్యాక్ డ్రాప్ లో కొత్తగా రాసుకున్నట్టు సమాచారం.