Begin typing your search above and press return to search.
'భగవద్గీత సాక్షిగా' అని ప్రమాణం చేస్తున్న మెగా హీరో...?
By: Tupaki Desk | 16 July 2020 1:20 PM ISTమెగాస్టార్ చిరంజీవి మేనల్లుడిగా టాలీవుడ్ లో అడుగుపెట్టిన సాయి ధరమ్ తేజ్ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకోడానికి కష్టపడుతున్నాడు. ఈ క్రమంలో వరుస సినిమాలను లైన్లో పెడుతూ దూకుడు చూపిస్తున్నాడు. 'చిత్రలహరి' 'ప్రతీరోజూ పండగే' వంటి రెండు బ్యాక్ టూ బ్యాక్ విజయాలు సొంతం చేసుకున్న సాయి ధరమ్ తేజ్ ప్రస్తుతం సుబ్బు దర్శకత్వంలో 'సోలో బ్రతుకే సో బెటర్' సినిమాలో నటిస్తున్నాడు. నభా నటేష్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్ పై బీవీఎస్‌ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్నారు. దీంతో పాటు 'ప్రస్థానం' దేవకట్టా దర్శకత్వంలో సాయిధరమ్ తేజ్ ఓ సినిమా స్టార్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ చిత్రాన్ని జె.బి.ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై జె.భగవాన్ - జె.పుల్లారావు నిర్మించనున్నారు. ఈ సినిమాలో తేజ్ యువ ఐఏఎస్ ఆఫీసర్ గా కనిపించనున్నారని వార్తలు వస్తున్నాయి.
ఇదిలా ఉండగా సాయి ధరమ్ తేజ్ ఓ కొత్త దర్శకుడితో తదుపరి మూవీ చేయబోతున్నాడట. ఇండస్ట్రీలో పలు సినిమాలకి స్క్రిప్ట్ విభాగంలో పని చేసిన ఆ యంగ్ డైరెక్టర్ చెప్పిన స్టోరీ లైన్ నచ్చడంతో తేజ్ ఈ ప్రాజెక్ట్ ఓకే చేసాడని సమాచారం. అంతేకాకుండా ఇప్పటికే ఈ సినిమాకి 'భగవద్గీత సాక్షిగా' అనే ఇంట్రెస్టింగ్ టైటిల్ కూడా రిజిస్టర్ చేయించారట. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ జరుపుకుంటున్న ఈ సినిమా ఓ రివేంజ్ డ్రామా అని తెలుస్తోంది. ఇక ఈ చిత్రాన్ని మెగా ఫ్యామిలీతో క్లోజ్ గా ఉండే ఓ ప్రముఖ నిర్మాత నిర్మించనున్నారట. 'సోలో బ్రతుకే సో బెటర్' మరియు దేవ కట్టా సినిమాలు కంప్లీట్ అయిన తర్వాత ఈ సినిమా పట్టాలెక్కే అవకాశం ఉంది. ఈ ప్రాజెక్ట్ కి సంబందించిన పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడికానున్నాయి.