Begin typing your search above and press return to search.

అమ్మాయిలకు సైట్ కొడుతూ ఉండేవాడ్ని

By:  Tupaki Desk   |   2 July 2018 9:49 AM IST
అమ్మాయిలకు సైట్ కొడుతూ ఉండేవాడ్ని
X
యాక్టర్ కాకపోయింటే ఏమయి ఉండేవారనే మాట దాదాపుగా ప్రతి నటుడికి ఏదో ఒక సందర్భంలో ఎదురవుతుంది. ఇదివరకు డాక్టర్ అంటూ కామన్ డైలాగు చెప్పేవాళ్లు కానీ ఈమధ్య ట్రెండు మారింది కాబట్టి రకరకాల ప్రొఫెషన్స్ గురించి చెప్పేస్తున్నారు. కానీ ఈ విషయంలో మెగా హీరో సాయి ధరమ్ తేజ్ ఇచ్చిన ఆన్సర్ చాలా ఫన్నీగా ఉంది.

తేజు హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ తేజ్.. ఐలవ్ యూ ప్రీ రిలీజ్ ఈవెంట్ తాజాగా జరిగింది. ఓ కాలేజీ క్యాంపస్ లో జరిగిన ఈవెంట్లో అమ్మాయిలు తమ ప్రశ్నలతో తేజును ఉక్కిరిబిక్కిరి చేశారు. ఆ టైంలో యాక్టర్ కాకపోయి ఉంటే ఏమయి ఉండేవారంటూ ఓ అమ్మాయి అడగ్గా.. ఓ నిరుద్యోగిగా మిగిలిపోయి పిట్టగోడలపై కూర్చుని అమ్మాయిలకు సైట్ కొడుతుండేవాడినని చెప్పాడు. తన లైఫ్ లో క్రేజీయెస్ట్ థింగ్ ఒకే లవ్ లెటర్ ఇద్దరు అమ్మాయిలకు ఇచ్చానని.. ఎలాగూ రిజెక్ట్ అవుతుందనే నమ్మకంతోనే అలా చేశానంటూ సాయి ధరమ్ తేజ్ చెప్పుకొచ్చాడు.

ఈ సినిమా టైటిల్ లాగే తేజ్.. ఐలవ్ యూ అంటూ ఎంతమంది ప్రపోజ్ చేశారంటూ వచ్చిన ప్రశ్నకు ఒక్కళ్లు కూడా లేరంటూ రిప్లయ్ ఇచ్చాడు. తొలిప్రేమ అయితే తాను ఫస్ట్ క్లాస్ చదువుతున్నప్పుడు తన పక్కన కూర్చున్న అమ్మాయి అంటూ చెప్పుకొచ్చాడు. చదువులో తాను యావరేజ్ స్టూడెంట్ నేనని.. 60 మార్కులు వచ్చేవని... అవే ఛాలా ఎక్కువనేశాడు తేజు. అమ్మాయిలు ఏం చేస్తే ఇంప్రెస్ అవుతారంటే బాగా చదువుకోవాలి అంటూ అందరి కేరింతల మధ్య అందమైన ఆన్సరిచ్చాడు సాయి ధరమ్ తేజ్.