Begin typing your search above and press return to search.

ఫోటో స్టొరీ మెగా మేనల్లుడు అనిపించాడుగా

By:  Tupaki Desk   |   3 Oct 2019 3:46 PM IST
ఫోటో స్టొరీ  మెగా మేనల్లుడు అనిపించాడుగా
X
మెగాస్టార్ చిరంజీవి నటించిన 'సైరా' అక్టోబర్ 2 న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రేక్షకుల నుండి పాజిటివ్ టాక్.. రివ్యూస్ కూడా ఎంకరేజింగ్ గా ఉండడంతో మెగా ఫ్యామిలీలో సంతోషం నెలకొంది. మహేష్ బాబు..కె. రాఘవేంద్ర రావు.. నానిలాంటి వారు ఇప్పటికే సినిమాపై తమ స్పందన తెలిపారు. ఇక మెగా ఫ్యామిలీ హీరోల హంగామా అయితే మామూలుగా ఉండదు కదా?

చిరు మేనల్లుళ్ళు సాయి ధరమ్ తేజ్..వైష్ణవ్ తేజ్ ఇద్దరూ అమ్మగారితో కలిసి మెగాస్టార్ ఇంటికి వెళ్ళారు. 'సైరా'కు వస్తున్న స్పందనకు ఆయనకు అభినందనలు తెలిపారు. జస్ట్ కంగ్రాట్స్ చెప్పడమే కాదు. తేజు అయితే మావయ్యను ముద్దుల్లో మంచెత్తాడు. అందరూ కలిసి ఫోటోలు తీయించుకున్నారు. చిరంజీవి తన సోదరి.. మేనల్లుళ్లతో చిరు నవ్వులు చిందిస్తూ ఫోటోలకు పోజులివ్వడం విశేషం.

ఈ ఫోటోలను తన ట్విట్టర్ ఖాతా ద్వారా షేర్ చేసిన తేజు "మన మెగాస్టార్ కు అభినందనలు తెలిపాను.. మేనల్లుడిగా కాదు.. ఒక అభిమానిగా. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి లాంటి చారిత్రక పాత్రకు ఆయన ప్రాణం పోసి స్క్రీన్ పై మ్యాజిక్ చేశారు. నా హీరో కు కృతజ్ఞతలు. లవ్ యూ సో మచ్." అంటూ ఒక డై హార్డ్ ఫ్యాన్ తరహాలో స్పందించాడు.