Begin typing your search above and press return to search.

మెగా హీరోకు అన్నీ రివర్స్ అవుతున్నాయే!

By:  Tupaki Desk   |   24 Nov 2018 6:16 AM GMT
మెగా హీరోకు అన్నీ రివర్స్ అవుతున్నాయే!
X
టైమ్..అదృష్టం.. జాతకం లాంటి పదాలను సక్సెస్ లో ఉన్నప్పుడు చాలామంది నమ్మరుగానీ ఒక్క సారి ఫెయిల్యూర్ మన వెంటబడి దూల తీర్చేస్తే అన్నీ నమ్ముతారు.. కాదు కాదు.. చచ్చినట్టు నమ్మాల్సి వస్తుంది. మరి ఆ ఫెయిల్యూర్ అనేది మనలాంటి వారినే కాదు సెలబ్రిటీలను కూడా వదలదు. మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ ప్రస్తుతం అలాంటి ఫేజ్ లో ఉనే ఉన్నాడు.

వరస ఫ్లాపుల్లో ఉన్న తేజు కాస్త గ్యాప్ తీసుకొని మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్లో 'చిత్రలహరి' సినిమాను మొదలు పెట్టాడు. కిషోర్ తిరుమల ఈ సినిమాకు దర్శకుడు. ఈ సినిమా మొదలైనప్పుడు మైత్రీ బ్లాక్ బర్ బ్యానరేగానీ ఇప్పుడు రెండు ఫ్లాపులతో వారికి కూడా షాక్ తగిలింది. గతంలో లాగా మైత్రీ అంటే హిట్టే అని కళ్ళు మూసుకుని చెప్పే పరిస్థితి లేదు. ఇదిలా ఉంటే 'చిత్రలహరి' ని ఏప్రిల్ 19 న విడుదల చేయాలనీ ప్లాన్ చేసుకున్నారు. మహేష్ బాబు సినిమా 'మహర్షి' ఏప్రిల్ 5 న రిలీజ్ కానుంది. దీంతో రెండు వారాలు గ్యాప్ ఇచ్చి 'చిత్రలహరి' ని ఏప్రిల్ 19 న ప్లాన్ చేశారు. కానీ ఇప్పుడు అదే డేట్ కు ఇప్పుడు నాని సినిమా 'జెర్సీ' వస్తోంది.

తేజు ప్రస్తుతం నాని సినిమాతో పోటీ తట్టుకునే పరిస్థితిలో లేడు. నాని కి ఈమధ్య రెండు ఫ్లాపులు తగిలినా సాలిడ్ మార్కెట్ ఉంది. పైగా క్రికెట్ నేపథ్యం ఉన్న సినిమా కావడంతో తేజు సినిమాకంటే నాని సినిమాపై ఎక్కువ ఆసక్తి ఉంటుంది. అలా అని డేట్ మార్చుదామనుకున్నా సమ్మర్ సీజన్ ఫుల్ బిజీగా ఉంటుంది. పోటీ లేకుండా సోలో రిలీజ్ దొరకడం కష్టం. ఇదంతా చూస్తుంటే మెగా హీరో కు అన్నీ ఎదురొస్తున్నట్టుగా అనిపించడం లేదూ?