Begin typing your search above and press return to search.

మేనల్లుడికి మెగాస్టార్ మూడు సూత్రాలు

By:  Tupaki Desk   |   1 Jun 2016 4:41 AM GMT
మేనల్లుడికి మెగాస్టార్ మూడు సూత్రాలు
X
సినీ ఇండస్ట్రీలోకి మెగా మేనల్లుడు సాయిధరం తేజ్ అడుగు పెట్టి ఏడేళ్లు అయిందంటే నమ్మడం కష్టం. ఇప్పటికి 4 సినిమాలు మాత్రమే చేసిన తేజు.. తొలి చిత్రం రేయ్ విడుదల కోసం నాలుగేళ్లు ఎదురుచూడాల్సి వచ్చింది. ఈ సమయంలో తాను ఎన్నో నేర్చుకున్నానని చెబుతాడు. మెగా అనే ట్యాగ్ కారణంగా సౌకర్యం కంటే.. బాధ్యత ఎక్కువగా ఫీలవుతానని కూడా అంటున్నాడు సాయిధరమ్.

పిల్లా నువ్వు లేని జీవితం - సుబ్రమణ్యం ఫర్ సేల్ - సుప్రీమ్ లతో వరుసగా 3 హిట్స్ కొట్టి హ్యాట్రిక్ హీరో అనిపించుకున్న తేజు.. తన సినిమాలు అటు ప్రయోగాత్మకంగాను, ఇటు కమర్షియల్ వాల్యూస్ తోనూ బ్యాలెన్సెడ్ గా ఉండాలని అనుకుంటున్నట్లు చెప్పాడు. ప్రస్తుతం చేస్తున్న తిక్క - బీవీఎస్ రవి చిత్రాలు ఎక్స్ పెరిమెంట్స్ కాగా.. గోపీచంద్ మలినేని డైరెక్షన్ లో చేస్తున్న మూవీ ఫుల్ లెంగ్త్ కమర్షియల్ ఎంటర్టెయినర్ అంటున్నాడు.

మెగాస్టార్ చిరంజీవి - పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లను ఉద్దేశ్యపూర్వకంగా ఇమిటేట్ చేయనని.. వారిని చూస్తూ పెరగడంతో మ్యానరిజమ్స్ అలవాటయ్యాయని అంటున్నాడు తేజు. 'పరిశ్రమలో నిలబడాలంటే, అసలు ఉండాలంటే మామయ్యలు కొన్ని రూల్స్ చెప్పారు. నిర్మాతను జాగ్రత్తగా చూసుకోవాలి - దర్శకుడు సంతృప్తి చెందాలి - ప్రేక్షకులను ఎంటర్టెయిన్ చేయాలి. నేను ఈ మూడింటికి కట్టుబడి ఉంటాను.'అంటున్నాడు సాయిధరం తేజ్.