Begin typing your search above and press return to search.

హమ్మయ్య.. తేజు సినిమా పట్టాలెక్కింది!

By:  Tupaki Desk   |   15 Oct 2018 10:47 AM IST
హమ్మయ్య.. తేజు సినిమా పట్టాలెక్కింది!
X
మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ సినిమా ఏప్పుడు ప్రారంభం అవుతుంది.. అసలు ఎవరితో సినిమా చేస్తున్నాడు.. కిషోర్ తిరుమల ప్రాజెక్ట్ ఉందా లేదా సైడ్ లైన్ అయిందా.. ఇలాంటి అన్నీ అనుమానాలకు ఈరోజు మైత్రీ మూవీ మేకర్స్ వారు ఫుల్ స్టాప్ పెట్టారు. 'చిత్రలహరి'(ఇంకా అధికారికంగా ప్రకటించలేదు) సినిమాకు ఈరోజు ఉదయం కొబ్బరికాయ కొట్టారు. ఈ సినిమా పూజాక్రమానికి దర్శకుడు కొరటాల శివ హాజరవ్వడం విశేషం.

ఈ సినిమా కోసం సాయి ధరమ్ తేజ్ మునుపటిలా ఫిట్ అవతారం లోకి మారడమే కాకుండా గెడ్డం పెంచి కొత్త లుక్ లో కనిపిస్తున్నాడు. ఈ సినిమాలో సాయి ధరమ్ 'హలో' ఫేమ్ కళ్యాణి ప్రియదర్శన్ తో రొమాన్స్ చేయనున్నాడు. రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ ఈ సినిమాకు సంగీత దర్శకుడు. కార్తీక్ ఘట్టమనేని సినిమాటోగ్రాఫర్. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ నవంబర్ 2 నుండి ప్రారంభం అవుతుందని సమాచారం.

అన్నట్టు ఈ రోజు సాయి ధరమ్ పుట్టిన రోజు. దీంతో మెగా హీరోలతో పాటు ఫ్యాన్స్ కూడా తేజుకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. మరి తన జన్మదినం నాడు లాంచ్ చేసిన ఈ సినిమా విజయం సాధించి ఫ్లాపుల హోరుకు అడ్డుకట్ట వేయాలని కోరుకుందాం. మా తుపాకి.కామ్ తరపున కూడా తేజు కు పుట్టినరోజు శుభాకాంక్షలు.