Begin typing your search above and press return to search.

రకుల్ పడుకున్నప్పుడు ఫోటో తీసేశాడా??

By:  Tupaki Desk   |   10 Oct 2017 6:33 PM IST
రకుల్ పడుకున్నప్పుడు ఫోటో తీసేశాడా??
X
మన హీరోల్లోని కాస్త కొంటె యాంగిల్ చూడాలంటే మాత్రం.. ఒకసారి మనం మెగా హీరో సాయి ధరమ్ తేజ్ దగ్గరకు వెళ్లాల్సిందే. ఎందుకంటే మనోడు తన కో స్టార్స్ అందరితోనూ చాలా సరదాగా ఉంటూ వారిని బాగా ఆటపట్టిస్తుంటాడు. ఇప్పుడు రకుల్ ప్రీత్ సింగ్ బర్త్ డే సందర్భంగా.. మనోడు షేర్ చేసిన ఒక ఫోటో చూస్తుంటే.. మనకు మరోసారి ఈ కొంటెకోణంగి అల్లరి పనులు నవ్వులు తెప్పిస్తాయి.

బహుశా ఎక్కడో వీరు ట్రావెల్ చేస్తున్నప్పుడు అనుకుంట.. మనోడు తన ప్రక్కనే కూర్చున్న రకుల్ ప్రీత్ సింగ్ నోరు వెళ్ళబెట్టుకుని పడుకున్నప్పుడు.. తను వెక్కిరిస్తూ ఒక సెల్ఫీ తీసుకున్నాడు. ఇప్పుడు ఆ ఫోటోను షేర్ చేసిన సాయిధరమ్ తేజ్.. 'లకుల్.. యాపీ బర్త్ డే' అంటూ విషెస్ కూడా చెప్పాడు. అంటే తను చిన్నపిల్లలా అలా పడుకుందని చెప్పడానికే ఈ పని చేశాడనమాట. దీనిపై స్పందించిన రకుల్.. థ్యాంక్యూ థలమూ అంటూ కామెంట్ చేస్తూ.. కాని ఆ ఫోటో ఉంది చూశావూ.. సిగ్గేస్తోంది బాబా అన్నట్లు తన ఎమోషన్ ను పంచుకుంది.

గతంలో సాయిధరమ్ అండ్ రకుల్ ఇద్దరూ కలసి గోపిచంద్ మలినేని తీసిన 'విన్నర్' సినిమాలో కనిపించారు. అయితే ఆ సినిమా అంతగా ఆకట్టుకోలేదు. దానితో రకుల్ కూడా గ్లామర్ రూటును వదిలి కాస్త నటనకు స్కోప్ ఉన్న క్యారక్టర్లపై దృష్టిపెడితే.. సాయిధరమ్ కూడా బివిఎస్ రవి డైరక్షన్లో జవాన్ అనే సినిమాతో కొత్త తరహా హీరోగా ప్రూవ్ చేసుకోవాలని చూస్తున్నాడు. ఇద్దరూ మంచి హిట్టులు కొడతారేమో చూద్దాం!!