Begin typing your search above and press return to search.

సైరా ఓబయ్యతో తొలిప్రేమ బ్యూటీ

By:  Tupaki Desk   |   9 May 2019 5:36 AM GMT
సైరా ఓబయ్యతో తొలిప్రేమ బ్యూటీ
X
విలక్షణ నటనతో బాషభేదం లేకుండా అభిమానులను సంపాదించుకున్న విజయ్ సేతుపతికి మాడరన్ కమల్ హాసన్ అని పేరు. తమిళ్ లో ఎన్నో బ్లాక్ బస్టర్స్ ఉన్నప్పటికీ తెలుగులో మార్కెట్ లేని కారణంగా ఇప్పటిదాకా మన ప్రేక్షకులకు అపరిచితుడిగా ఉన్న ఇతను సైరాలో ఓబయ్య పాత్రను చేస్తున్న సంగతి తెలిసిందే. దీంతో పాటు వైష్ణవ్ తేజ్ డెబ్యూ మూవీ ఉప్పెనలో కూడా నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రను చేస్తున్నాడు.

రెండు మెగా కాంపౌండ్ సినిమాలే కాబట్టి ఎంట్రీ గా గ్రాండ్ గా ఉంటుందని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. ఇదిలా ఉండగా ఒకప్పుడు హీరోయిన్లు ఇతనితో చేయాలా వద్దా అనే మీమాంస నుంచి ఏరికోరి మరీ విజయ్ సేతుపతి సరసన అంటే యెగిరి గంతేసి మరీ ఒప్పుకుంటున్నారు.

ఇటీవలే శృతి హాసన్ జోడిగా ఓ మూవీ స్టార్ట్ అయిన సంగతి తెలిసిందే. దీని కన్నా ముందే రాశి ఖన్నా విజయ్ సేతుపతితో జోడి కట్టేసింది. విజయ్ చందర్ దర్శకత్వంలో రూపొందుతున్న సంగ తమిజన్ లో విజయ్ సేతుపతి డ్యూయల్ రోల్ చేస్తున్నాడు. ఇప్పటికే సగభాగం పూర్తయ్యింది.

రాశి ఖన్నా ఓ పాత్రకు జంటగా నటించగా మరో జోడిగా చిత్రలహరి బ్యూటీ నివేత పేతురాజ్ సెలెక్ట్ అయ్యింది. డిఫరెంట్ జానర్ లో రూపొందుతున్న ఈ మూవీని తెలుగులో డబ్ చేసే అవకాశాలు ఉన్నాయి. నాజర్ రవి కిషన్ అశుతోష్ రానా లాంటి తెలుసున్న తారాగణం ఉండటం మనవాళ్లకు కనెక్ట్ అయ్యే ఛాన్స్ లేకపోలేదు