Begin typing your search above and press return to search.

ఫోటో స్టోరి: అల్లుడూ సుప్రీం.. ఏమిటా స‌రసం?

By:  Tupaki Desk   |   9 Dec 2020 10:15 AM IST
ఫోటో స్టోరి: అల్లుడూ సుప్రీం.. ఏమిటా స‌రసం?
X
నాగ‌బాబు ముద్దుల కూతురు కొణిదెల నిహారిక వివాహం దేవ‌తలు దీవెన‌లందించ‌గా కుటుంబ స‌భ్యులు బంధుమిత్రుల స‌మ‌క్షంలో మ‌రి కొన్ని గంట‌ల్లో జ‌ర‌గ‌బోతోంది. గుంటూరుకు చెందిన ఐజీ జొన్న‌ల‌గ‌డ్డ ప్ర‌భాక‌ర‌రావు త‌న‌యుడు జొన్న‌ల‌గ‌డ్డ చైత‌న్య‌తో నిహారిక వివాహం జ‌ర‌గ‌బోతోంది. గ‌త ఐదు రోజుల ముందుగానే మెగా ఫ్యామిలీలో పెళ్లిసంద‌డి మొద‌లైంది. పెళ్లి కూతురు కార్య‌క్ర‌మంతో మెగా సంద‌డి స్టార్ట‌యింది.

నిహారిక వివాహం రాజ‌స్థాన్ లోని ఉద‌య్‌పూర్ ఓబెరాయ్ ఉద‌య్ విలాస్ లో జ‌ర‌గ‌నున్న విష‌యం తెలిసిందే. వివాహం కోసం మెగా ఫ్యామిలీ అంతా ఆదివారం ఉద‌య్ ‌పూర్ ‌కు చేరుకున్నారు. ఒక్కో ఫ్యామిలీ ఒక్కో ప్ర‌త్యేక విమానంలో ఉద‌య్ పూర్ ‌కు చేరుకున్న విష‌యం తెలిసిందే. మంగ‌ళ‌వానం సంగీత్ కార్య‌క్ర‌మం జ‌రిగింది. ఇందులో మెగా ఫ్యామిలీలోని హీరోలంతా నిహారిక‌- చైత‌న్య‌ల‌తో క‌లిసి ఆడిపాడారు.

ఆ త‌రువాత మంగ‌ళ‌వారం రాత్రి మెహెందీ ఫంక్ష‌న్ జ‌రిగింది. ఈ కార్య‌క్ర‌మంలో ఫ్యామిలీ హీరోల‌తో క‌లిసి ప‌వ‌ర్ ‌స్టార్ ప‌వ‌న్ ‌క‌ల్యాణ్ కూడా పాల్గొన్నారు. అంద‌రికంటే ఆల‌స్యంగా ఉద‌య్ పూర్ వెళ్లిన ప‌వ‌న్ మెహెందీ ఫంక్ష‌న్‌లో అల్లుడు సాయిధ‌ర‌మ్ తేజ్ ‌తో క‌లిసి స‌ర‌దాగా క‌నిపించ‌డం ఫ్యాన్స్ ని .., నెటిజ‌న్స్ ని ఆక‌ట్టుకుంటోంది. ప‌వ‌న్ - సాయిధ‌ర‌మ్ ‌తేజ్ మ‌ధ్య మంచి బాడింగ్ వున్న విష‌యం తెలిసిందే. అత‌న్ని హీరోగా నిల‌బెట్టాల‌ని ప‌వ‌న్ తెర వెన‌కుండి చాలా చేశారు. మెహెందీ ఫంక్ష‌న్ ‌లో మామా అల్లుళ్ల స్పెష‌ల్ మూవ్ మెంట్ సెంట‌రాఫ్ ఎట్రాక్ష‌న్ ‌గా మారింది. ప్ర‌స్తుతం ఈ ఫొటో ఇంట‌ర్నెట్ ‌లో సంద‌డి చేస్తోంది.