Begin typing your search above and press return to search.

ఆవిడ ఇలియానా.. ఈయ‌న ప‌వ‌న్‌

By:  Tupaki Desk   |   1 Sep 2015 6:03 AM GMT


చిరంజీవి ఫ్యామిలీ నుంచి ఓ హీరోయిన్ వ‌స్తోంద‌నే ప్ర‌చారం ముమ్మ‌రంగా సాగుతోంది. మెగా బ్ర‌ద‌ర్ నాగ‌బాబు త‌న‌య నిహారిక త్వ‌ర‌లోనే ఓ సినిమాలో హీరోయిన్‌ గా న‌టించ‌బోతోంద‌ని వారం రోజులుగా ఫిల్మ్‌ న‌గ‌ర్ జ‌నాలు మాట్లాడుకొంటున్నారు. ఇప్ప‌టికే యాంక‌ర్‌ గా ఆమె బుల్లితెర‌పై మెరిసిపోతోంది. ఇదివ‌ర‌కే ఆమె హీరోయిన్‌ గా ఎంట్రీ ఇస్తుంద‌ని, అఖిల్ స‌ర‌స‌న న‌టించ‌బోతోంద‌ని ప్ర‌చారం జ‌రిగింది. కానీ అది నిజం కాలేదు. నిహారిక బుల్లితెర‌తోనే ఆగిపోయింది. ఇప్పుడు మాత్రం ఆమెని హీరోయిన్ చేయాల‌ని మెగా ప్యామిలీ డిసైడైన‌ట్టు ప్ర‌చారం సాగుతోంది. అందులో నిజం ఉందో లేదో తెలియ‌దు కానీ... నిహారిక మాత్రం సినిమా డైలాగులు సీరియ‌స్‌ గా ప్రాక్టీస్ చేస్తున్న‌ట్టు అనిపిస్తోంది.

ఉన్న‌ట్టుండి `జ‌ల్సా`లో ఇలియానాగా మారిపోయింది నిహారిక‌. ఆమెకి వ‌ర‌స‌కు బావ అయిన సాయిధ‌ర‌మ్ తేజ్ ప‌వ‌న్‌ క‌ళ్యాణ్‌ గా మారిపోయాడు. వాళ్లిద్ద‌రూ క‌లిసి `జ‌ల్సా`లోని ఓ డైలాగ్‌ కి యాక్ట్ చేశారు. దాన్ని డ‌బ్‌ స్మాష్‌ లో పెట్టి అభిమానుల‌తో పంచుకొన్నారు. ఆ క్లిప్ ఇప్పుడు ఇంట‌ర్నెట్‌ లో హ‌ల్‌ చ‌ల్ చేస్తోంది. ప్రాక్టీస్‌ లో భాగంగానే నిహారిక అది చేసిందా? లేక స‌ర‌దాగా టైమ్‌ పాస్‌ కి చేసిందా అన్న‌ది తేలాల్సి వుంది. అయితే వాళ్లిద్ద‌రి యాక్టింగ్ మాత్రం సూప‌ర్బ్ అనిపించింది. ముఖ్యంగా నిహారికలో హీరోయిన్ ల‌క్ష‌ణాలు పుష్క‌లంగా క‌నిపిస్తున్నాయి. మ‌రి నిహారిక సిల్వ‌ర్ స్క్రీన్ ఎంట్రీ ఎప్పుడో చూడాలి. టాలీవుడ్‌ లో సినిమా కుటుంబాల నుంచి వ‌చ్చిన క‌థానాయిక‌లు నిల‌దొక్కుకున్న దాఖలాలు లేవు. హీరోయిన్‌ గా కాకుండా విభిన్న‌మైన పాత్ర‌లు చేస్తున్న మంచు ల‌క్ష్మి మాత్రం కాస్త ప్ర‌భావం చూపుతోంది. మ‌రి నిహారిక విష‌యంలో ఏం జ‌రుగుతుందో చూడాలి.