Begin typing your search above and press return to search.

తేజుతో ఆ పిల్ల అంత క్లోజా!

By:  Tupaki Desk   |   29 Jun 2017 5:21 AM GMT
తేజుతో ఆ పిల్ల అంత క్లోజా!
X
మెగా ఫ్యామిలీ హీరోల్లో సాయి ధరం తేజ్ మహా స్పీడ్. మరే హీరో చేయనంత వేగంగా సినిమాలు చేసేస్తుంటాడు. మొదట వరుసగా హిట్లు.. ఆ తర్వాత వరుసగా ఫ్లాపులు పలకరిస్తున్నా.. తన పని తను చేసుకుపోతున్న హీరో తేజు. ప్రస్తుతం ఈ మెగా హీరో 'జవాన్' అనే మూవీని చేస్తుండగా.. రీసెంట్ గా ఈ సినిమాకి సంబంధించిన కొన్ని స్టిల్స్ ను విడుదల చేశారు.

జవాన్ మూవీ స్టిల్స్ ను దర్శకుడు బీవీఎస్ రవి విడుదల చేసినప్పటి నుంచి.. ఒక్కటే పాయింట్ హైలైట్ అయిపోయింది. హీరో సాయిధరం తేజ్.. హీరోయిన్ మెహ్రీన్ కౌర్ ల మధ్య కెమిస్ట్రీ పండిన విధానం అందరినీ ఆకట్టుకుంటోంది. నిజంగానే వీరిద్దరి మధ్య ఏదో ఉందనే స్థాయిలో స్టిల్స్ లోనే అలరించేశారు ఈ జంట. షూటింగ్ జరుగుతున్న సమయంలో కూడా యూనిట్ మెంబర్స్ కు ఇలాంటి ఫీలింగే కలిగేదట. కెమేరా ఆన్ చేసి రోల్ చేయగానే.. హీరో హీరోయిన్స్ ఇద్దరూ చక్కటి ప్రతిభ చూపించేసేవారట. ఇద్దరి కెమిస్ట్రీ చూడ్డానికి రెండు కళ్లు చాలలేదని.. సినిమా విడుదల అయ్యాక ఆన్ స్క్రీన్ పై ఈ కెమిస్ట్రీ మరింత అద్భుతంగా ఉంటుందని చెబుతున్నారు.

ఇద్దరి మధ్య ముందు నుంచి స్నేహం ఉండడంతోనే తేజు- మెహ్రీన్ ల మధ్య కెమిస్ట్రీ అంతగా పండిందని టాక్ వినిపిస్తోంది. దిల్ రాజు సమర్పణలో కృష్ణ నిర్మిస్తున్న ఫ్యామిలీ డ్రామా జవాన్ మూవీని సెప్టెంబర్ 1న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/