Begin typing your search above and press return to search.

విన్నర్ కాంబో మళ్లీ షురూ అవుతోంది

By:  Tupaki Desk   |   14 Oct 2017 5:21 PM GMT
విన్నర్ కాంబో మళ్లీ షురూ అవుతోంది
X

సినీ ఫీల్డ్ లోకి వచ్చిన కొన్నేళ్లకే మాస్ ఇమేజ్ ను సంపాదించుకున్న హీరో సాయి ధరమ్ తేజ్. హిట్స్ బాగానే అందుకుంటున్న ఇంకా బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ స్థాయిలో విజయాలను అందుకోవడంలో సక్సెస్ అవ్వడం లేదు. అంతే కాకుండా చివరగా నటించిన రెండు సినిమాలు అనుకున్నంతగా విజయాన్ని అందించలేకపోయాయి. అలాగే స్పెషల్ రోల్ లో నటించిన నక్షత్రం మూవీ కూడా సాయికి సంతృప్తిని ఇవ్వలేదు. కానీ సినిమాల ప్రభావం ఎలా ఉన్నా మెగా అల్లుడికి ఛాన్సులు మాత్రం బాగానే వస్తున్నాయి.

ప్రస్తుతం బివిఎస్.రవి దర్శకత్వంలో జవాన్ సినిమాను చేస్తున్న సంగతి తెలిసిందే. అలాగే వివి.వినాయక్ దర్శకత్వంలో కూడా సినిమాను చేస్తున్నాడు. ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. అయితే ఇవి రెండు షూటింగ్ దశలో ఉండగానే మనోడు మరో దర్శకుడిపై నమ్మకం ఉంచి సినిమాకు ఒకే చెప్పాడు. అదే కరుణకారన్ తో చేయబోతున్న సినిమా. ఇక ఆ తరువాత మరో సినిమా చేస్తాడట. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో మరోసారి నటించడానికి రెడీ అయ్యాడు సాయి. ఇంతకుముందు వీరి కాంబినేషన్ లో వచ్చిన విన్నర్ సినిమా అంతగా ఆడలేదు.

అయితే ఈసారి ఎలా అయినా హిట్ కొట్టి మళ్లీ ఫెయిల్యూర్ పై రివెంజ్ తీర్చుకోవాలని చూస్తున్నారు. ముఖ్యంగా గోపీచంద్ మలినేనికి బలుపు సినిమా తర్వాత సరైన విజయాన్ని అందుకోలేదు. రామ్ తో తీసిన పండగచేస్కో కూడా డీజిస్టార్ గా నిలిచింది. అయితే విన్నర్ అపజయం తర్వాత మంచి కమర్షియల్ హంగులను జోడించి ఒక కొత్త తరహా కథను సాయితో చేయడానికి గోపి డిసైడ్ అయ్యాడు. సాయి కూడా స్క్రిప్ట్ మీద నమ్మకంతో గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఇక గౌతమ్ నంద ప్రొడ్యూసర్స్ భగవాన్ - పుల్లారావు ఈ సినిమాను నిర్మించేందుకు సిద్ధమవుతున్నారని తెలుస్తోంది.