Begin typing your search above and press return to search.

నేను అడిగితే ప్రభాస్ అన్నా వెంటనే..!

By:  Tupaki Desk   |   6 July 2021 8:30 AM GMT
నేను అడిగితే ప్రభాస్ అన్నా వెంటనే..!
X
రన్‌ రాజా రన్ సినిమాతో ఇండస్ట్రీకి చిన్న వయసులోనే దర్శకుడిగా పరిచయం అయిన సుజీత్ రెండవ సినిమానే ప్రభాస్ తో పాన్ ఇండియా సినిమా సాహో చేసే అవకాశం దక్కించుకున్నాడు. బాలీవుడ్‌ లో సైతం మంచి గుర్తింపును దక్కించుకున్న ఈ యువ దర్శకుడు తదుపరి ప్రాజెక్ట్‌ విషయంలో ఇంకా క్లారిటీ ఇవ్వలేదు. ఆమద్య పలువురు హీరోలతో ఈయన సినిమా చేయబోతున్నట్లుగా వార్తలు వినిపించాయి. కాని ఇప్పటి వరకు కన్ఫర్మ్‌ అవ్వలేదు. త్వరలోనే ఈయన మరో భారీ సినిమాను చేయడం ఖాయం అంటూ ఇండస్ట్రీ వర్గాల టాక్. సునీత్‌ ఇప్పటికే పెద్ద హీరో కోసం స్క్రిప్ట్‌ ను రెడీ చేశాడని... త్వరలోనే ఆ సినిమా ను మొదలు పెట్టబోతున్నట్లుగా కూడా వార్తలు వస్తున్నాయి. త్వరలో మరింత క్లారిటీ వస్తుందేమో చూడాలి.

తాజాగా దర్శకుడు తరుణ్‌ భాస్కర్‌ హోస్ట్ గా వ్యవహరిస్తున్న ఒక టాక్ షో లో పాల్గొన్న సుజీత్‌ పాల్గొన్నాడు. ఈ సందర్బంగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ప్రభాస్‌ అన్న అంటే నాకు ఎంతో నమ్మకం. నా కంటే నాకు ప్రభాస్ అన్నపై నమ్మకం ఎక్కువ. ఇప్పుడు అన్నకు ఫోన్ చేసి అవకాశం ఇవ్వమంటే వెంటనే నాతో సినిమాకు ఓకే అంటాడు. మా ఇద్దరి మద్య కేవలం ఒక ఫోన్ కాల్‌ దూరమే అంటూ చెప్పుకొచ్చాడు. చాలా మంది దర్శకులకు ప్రభాస్ అన్నకు కథ వినిపించడమే చాలా కష్టమైన విషయం. కాని నాకు మాత్రం ఆయన ఏ సమయంలో అయినా అందుబాటులో ఉంటారు. ఆయన నాపై అంతగా నమ్మకం ఉంచారని సుజీత్ చెప్పుకొచ్చాడు.

బాహుబలి సినిమా తర్వాత ప్రభాస్‌ కు ఎలాంటి సినిమా వస్తుందా అంటూ అంతా ఎదురు చూస్తున్న సమయంలో అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా భారీ యాక్షన్‌ సినిమాగా సాహోను తెరకెక్కించి మెప్పించాడు. అందుకే సాహో దర్శకుడు సుజీత్‌ అంటే ప్రత్యేకమైన అభిమానంను ప్రభాస్ చూపిస్తూ ఉంటాడు. అందుకే ప్రభాస్ కు సుజీత్ తో మళ్లీ సినిమా చేయాలనే ఆసక్తి ఉందన్నమాట. ఇప్పుడు కాకున్నా రాబోయే కొన్ని ఏళ్ల తర్వాత అయినా సుజీత్ దర్శకత్వంలో ప్రభాస్ సినిమా ఉంటుందనే నమ్మకం ను కొందరు వ్యక్తం చేస్తున్నారు.

యూవీ క్రియేషన్స్‌ లో యంగ్‌ స్టార్‌ హీరో తో సుజీత్ తదుపరి సినిమా ఉంటుందనే వార్తలు వస్తున్నాయి. అతి త్వరలోనే ఆ విషయమై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. సుజీత్‌ తదుపరి సినిమా కోసం ఇండస్ట్రీ వర్గాలతో పాటు ప్రభాస్ అభిమానులు మరియు ఆయన అభిమానులు కూడా వెయిట్‌ చేస్తున్నారు. సుజీత్ తదుపరి సినిమా ఏంటీ అనేది ఈ ఏడాది చివరి వరకు ఒక క్లారిటీ వస్తుందేమో చూడాలి.