Begin typing your search above and press return to search.

'ఏకే' రీమేక్ డైరెక్ట‌ర్ సాగ‌ర్ మ‌రో హరీష్ అవుతాడా..?

By:  Tupaki Desk   |   23 Dec 2020 9:30 AM GMT
ఏకే రీమేక్ డైరెక్ట‌ర్ సాగ‌ర్ మ‌రో హరీష్ అవుతాడా..?
X
టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరైన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో సినిమా చేసే అవకాశం కోసం ప్రతి దర్శకుడు ఎదురు చేస్తుంటారు. ఇక పవన్ కళ్యాణ్ కూడా కెరీర్ స్టార్టింగ్ నుంచి అగ్ర దర్శకుల వెనుక పరుగులు తీయకుండా తనకు కంఫర్టబుల్ గా ఉండే వారితో సినిమాలు చేస్తూ వచ్చాడు. అయితే తాను నటించే సినిమాల్లో పవన్ ఫింగరింగ్ ఎక్కువగా ఉంటుందనే టాక్ ఎప్పటి నుంచో ఉంది. డైరెక్టర్ గా కూడా అనుభవం ఉన్న పవన్ కళ్యాణ్ సినిమా విషయంలో జోక్యం చేసుకుంటారని అంటుంటారు.

ఇంతకముందు పవన్ నటించిన సూపర్ హిట్ సినిమా 'గబ్బర్ సింగ్' అప్పుడు కూడా ఇలాంటి కామెంట్స్ వచ్చాయి. 'దబాంగ్' చిత్రానికి రీమేక్ తెరకెక్కిన ఈ చిత్రానికి హరీష్ శంకర్ దర్శకత్వం వహించారనే విషయం తెలిసిందే. ఈ సినిమాలో పవన్ గెటప్ డైలాగ్స్ పై స్పెషల్ కేర్ తీసుకున్న హరీష్.. 'గబ్బర్ సింగ్' హిట్ లో భాగం అయ్యాడు. అయినప్పటికీ ఈ సినిమాలో పవన్ ఫింగరింగ్ ఉందనే మాటలు అప్పట్లో బాగా వినిపించాయి. అయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ ని డైరెక్ట్ చేయబోయే సాగర్ కె.చంద్ర కూడా మరో హరీష్ అవుతాడేమో అని కామెంట్స్ వినిపిస్తున్నాయి.

'అప్పట్లో ఒకడుండేవాడు' సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న సాగర్ కె.చంద్ర.. పవన్ కళ్యాణ్ ని డైరెక్ట్ చేసే ఛాన్స్ కొట్టేయడంతో టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారిపోయాడు. మలయాళ హిట్ మూవీ 'అయ్యప్పనుమ్ కోశీయుమ్' ని పవన్ - రానా లతో రీమేక్ చేసే బాధ్యతలను తీసుకున్నాడు సాగర్. ఈ చిత్రానికి త్రివిక్రమ్ శ్రీనివాస్ డైలాగ్స్ అందించడంతో పాటు మార్పులు చేర్పులు చూస్తున్నారని సమాచారం. అయితే ఇప్పుడు ఏకే రీమేక్ లో పవన్ తో పాటు త్రివిక్ర‌మ్ ఫింగ‌రింగ్ కూడా ఉండే అవ‌కాశం ఉందని.. అప్పుడు హరీష్ శంకర్ ఉన్న పొజిషన్ లో ఇప్పుడు సాగర్ ఉంటాడని ఫిలిం సర్కిల్స్ లో కామెంట్స్ వినిపిస్తున్నాయి.