Begin typing your search above and press return to search.

పోలీస్ ఆఫీసర్ కాలేకపోయినందుకు బాధగా ఉంది: శ్రీవిష్ణు

By:  Tupaki Desk   |   4 July 2022 7:31 AM GMT
పోలీస్ ఆఫీసర్ కాలేకపోయినందుకు బాధగా ఉంది: శ్రీవిష్ణు
X
మొదటి నుంచి కూడా శ్రీవిష్ణు డిఫరెంట్ రోల్స్ ను ఎంచుకుంటూ వస్తున్నాడు. ఈ మధ్య కాలంలో ఆయన చేసిన సినిమాల్లో 'రాజ రాజ చోర'కి మాత్రమే కాస్త మంచి టాక్ వచ్చింది. మిగతా సినిమాలు మాత్రం సక్సెస్ కి చాలా దూరంగానే ఉండిపోయాయి.

అయినా ఆయన నిరాశ పడకుండా కొత్తదనానికి ప్రాధాన్యతనిస్తూ వెళుతున్నాడు. అలా ఆయన చేసిన సినిమానే 'అల్లూరి' సినిమా. బెక్కెం వేణుగోపాల్ నిర్మించిన ఈ సినిమాకి ప్రదీప్ వర్మ దర్శకత్వం వహించాడు. తాజాగా ఈ సినిమా నుంచి టీజర్ ను రిలీజ్ చేశారు.

ఈ వేదికపై నుంచి శ్రీవిష్ణు మాట్లాడుతూ .. 'అల్లూరి' సినిమా నుంచి ఇప్పుడు టీజర్ ను రిలీక్ చేశాము. అందరికీ కూడా ఈ టీజర్ బాగా నచ్చుతుందని అనుకుంటున్నాను. అల్లూరి సీతారామరాజు జయంతి సందర్భాన్ని పురస్కరించుకుని ఈ రోజున ఈ టీజర్ ను రిలీజ్ చేసినందుకు నిజంగా చాలా సంతోషంగా ఉంది. నేను .. దర్శకుడు ప్రదీప్ ఈ సినిమా కోసం నాలుగైదేళ్లుగా కలిసి ట్రావెల్ చేస్తున్నాము. ఆయనలో నేను అల్లూరి ఆవేశాన్ని చూశాను. అంతే పవర్ఫుల్ గా ఆయన కనిపిస్తాడు.

మొదటి నుంచి సోల్జర్స్ .. పోలీసులు .. డాక్టర్లు నాకు హీరోలుగా కనిపిస్తుంటారు. అలాంటి పాత్రలు చేయాలనే ఆసక్తి ఉండేది. సినిమా కోసమని చెప్పేసి వాళ్ల స్థాయిని తగ్గించడమనేది నాకు నచ్చదు. సిన్సియర్ గా ... సీరియస్ గా చేసే పాత్రలు వస్తే చేయాలని ఉండేది. అలాంటి నాతో మొదటిసారిగా ప్రదీప్ పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రను చేయించాడు. ఇంతకుముందు వేరే పాత్రలు చేశాను .. దొంగ పాత్రలు కూడా చేశాను .. పోలీస్ పాత్రలు చేయాలంటేనే భయం. అలాంటి నాకు నిజాయితీ కలిగిన ఒక పోలీస్ ఆఫీసర్ పాత్రను పోషించే అవకాశం దొరికింది.

ఈ పాత్రను చేసినందుకు నేను చాలా హ్యాపీగా ఫీలవుతున్నాను. ఈ సినిమా చేస్తున్నప్పుడు నేనెందుకు పోలీస్ ఆఫీసర్ ను కాలేకపోయానురా అని చెప్పేసి ఫస్టు టైమ్ బాధపడ్డాను. నన్ను హీరోగా లాంచ్ చేసిన బెక్కెం వేణుగోపాల్ గారే నాతో ఈ సినిమా చేయడం నాకు మరింత ఆనందాన్ని కలిగించే విషయం.

ఈ సినిమాలో నా పాత్రకి ప్రతి ఒక్కరూ కనెక్ట్ అవుతారని నమ్ముతున్నాను. ఇప్పుడున్న ఈ పరిస్థితిల్లో ఇలాంటి ఒక కథ చెప్పడం అవసరం. వాస్తవ సంఘటనలను ఆధారంగా చేసుకుని రూపొందించిన ఈ సినిమా తప్పకుండా పెద్ద హిట్ అవుతుందని నమ్ముతున్నాను " అంటూ ముగించాడు.