Begin typing your search above and press return to search.

జనతా విలన్ కి ఆఫర్లు పెరుగుతున్నాయ్

By:  Tupaki Desk   |   17 Sep 2016 9:30 AM GMT
జనతా విలన్ కి ఆఫర్లు పెరుగుతున్నాయ్
X
సచిన్ ఖేడ్కర్ అని చెప్పేస్తే టక్కుమని తెలుగు ఆడియన్స్ అందరూ గుర్తు పట్టేయలేకపోయినా.. జనతా గ్యారేజ్ లో మోహన్ లాల్ కి విలన్ గా నటించిన యాక్టర్ అంటే మాత్రం.. గ్యారంటీగా గుర్తొచ్చేస్తాడు. ఆ కేరక్టర్లో తన నటనతో అంతగా మెప్పించిన సచిన్ ఖేద్కర్ కు.. బాలీవుడ్ లో కూడా మంచి క్రేజ్ ఉంది.

జనతా గ్యారేజ్ సక్సెస్ ఈ యాక్టర్ ట్యాలెంట్ కూడా ఒక పార్ట్ కావడం.. విలన్ గా పెర్ఫామెన్స్ మెప్పించటం తో.. ఇప్పుడు టాలీవుడ్ నుంచి ఇలాంటి ఆఫర్లు పెరుగుతున్నాయి. ఇప్పటికే తమిళ్ లో కూడా విలన్ రోల్స్ లోనే కనిపిస్తుండగా.. టాలీవుడ్ ఈయనకు రెడ్ కార్పెట్ పరిచేస్తోంది. సంపత్ నంది దర్శకత్వంలో గోపీచంద్ హీరోయిన్ గా నటిస్తున్న సినిమాకు సచిన్ ఖేడ్కర్ నే ఫైనల్ చేసినట్లు తెలుస్తోంది.

యాక్షన్ ఓరియెంటెడ్ గా రూపొందనున్న గోపీచంద్ మూవీని.. ఎక్కువగా బ్యాంకాక్ లో షూట్ చేయనున్నారు. హన్సిక.. కేథరిన్ థ్రెసాలు.. ఈ చిత్రంలో హీరోయిన్స్ కాగా.. మెయిన్ విలన్ పాత్రలో మరోసారి జనతా విలన్ కనిపించనున్నాడు. ఈ సినిమా కూడా సక్సెస్ అయిందంటే.. ఇక టాలీవుడ్ లో ఈ మరాఠి యాక్టర్ జోరును ఆపడం కాస్త కష్టమైన విషయమే.