Begin typing your search above and press return to search.

ఎన్టీఆర్ బ‌యోపిక్ లో `నాని` మామ‌గారు?

By:  Tupaki Desk   |   26 Jun 2018 4:37 PM GMT
ఎన్టీఆర్ బ‌యోపిక్ లో `నాని` మామ‌గారు?
X
విశ్వ‌విఖ్యాత, న‌ట సార్వ‌భౌమ నంద‌మూరి తార‌క రామారావు జీవిత చ‌రిత్ర ఆధారంగా తెర‌కెక్క‌నున్న ఎన్టీఆర్ బ‌యోపిక్ ను బాల‌కృష్ణ ప్ర‌తిష్టాత్కకంగా నిర్మిస్తోన్న సంగ‌తి తెలిసిందే. క్రిష్ ద‌ర్శ‌క‌త్వంలో రూపుదిద్దుకుంటోన్న ఈ బ‌యోపిక్ లో కీల‌క‌మైన పాత్ర‌ల కోసం టాలీవుడ్ - బాలీవుడ్ కు చెందిన ప‌లువురు న‌టుల‌ను క్రిష్ - బాల‌య్య ఎంపిక చేస్తున్నారు. ఆయా పాత్ర‌కు స‌రిగ్గా సూట్ అయ్యేవారిని ఏరికోరి ఎంచుకుంటున్నారు. ఎన్టీఆర్ బయోపిక్ లో మోహన్ బాబు ఓ కీలక పాత్ర పోషించ‌నున్న‌ట్లు పుకార్లు వ‌చ్చిన సంగతి తెలిసిందే. అయితే, తాజాగా ఆ బ‌యోపిక్ లో మ‌రో కీల‌క పాత్ర కోసం బాలీవుడ్ న‌టుడు స‌చిన్ ఖేద్కర్ ను క్రిష్ ఎంపిక చేసిన‌ట్లు తెలుస్తోంది. నాదెండ్ల భాస్కర రావు పాత్రను స‌చిన్ పోషించ‌నున్న‌ట్లు ఫిల్మ్ న‌గ‌ర్ లో పుకార్లు షికార్లు చేస్తున్నాయి.

13, బ్ర‌దర్స్, నేను లోక‌ల్ - జ‌న‌తా గ్యారేజ్ వంటి చిత్రాల‌తో స‌చిన్ తెలుగు ప్రేక్ష‌కుల‌కు సుప‌రిచితుడే. అందుకే - ఎన్టీఆర్ లో కీల‌క పాత్ర అయిన నాదెండ్ల పాత్రను ఆయ‌నతో చేయిస్తే బాగుంటుంద‌ని క్రిష్ భావించాడ‌ట‌. ఇదే విష‌యాన్ని బాల‌య్య‌బాబుకు చెప్పి ఒప్పించాడ‌ట‌. నాదెండ్ల పాత్ర కోసం స‌చిన్ క‌న్నా ముందు కొంత‌మంది తెలుగు న‌టుల‌ను పరిశీలించినా ఓకే కాలేద‌ట‌ - చివ‌ర‌కు క్రిష్ సూచ‌న ప్ర‌కారం స‌చిన్ ఆ పాత్ర‌కు ఎంపిక‌య్యార‌ట‌. అందులోనూ - `ఎన్టీఆర్` లో మెయిన్ విలన్ గా నాదెండ్లను ప్రొజెక్ట్ చేయ‌బోతున్న‌ట్లు తెలుస్తోంది. ఎన్టీఆర్ ను గ‌ద్దె దించిన నాదెండ్ల‌ సీఎం కావ‌డం...ఆ త‌ర్వాత మ‌ళ్లీ ఎన్టీఆర్ సీఎం కావ‌డం....వంటి ప‌రిణామాలు ఆ బ‌యోపిక్ లో కీల‌కం కానున్నాయి. కాబ‌ట్టి, ఆ పాత్ర‌కు స‌చిన్ న్యాయం చేయ‌గ‌ల‌రని క్రిష్ భావించార‌ట‌. మ‌రి, అధికారికంగా ఈ సినిమాలో ఎవ‌రు నటిస్తున్నది తెలియాలంటే మ‌రికొంత కాలం వేచి చూడ‌క త‌ప్ప‌దు.