Begin typing your search above and press return to search.

ఆ సీఎం పాత్రలో సచిన్

By:  Tupaki Desk   |   5 May 2018 5:37 AM GMT
ఆ సీఎం పాత్రలో సచిన్
X
ఎన్టీఆర్.. ఇప్పుడు సెట్స్ మీదకు వెళ్లనున్న సినిమాల్లో అత్యంత క్రేజీ ప్రాజెక్టులలో ఒకటి. నందమూరి బాలకృష్ణ టైటిల్ రోల్ లో కనిపించనుండడం ఈ మూవీకి అసలు సిసలైన ఆకర్షణ. అయితే.. ఈ సినిమాలో నిజ జీవిత పాత్రలు ఎన్నో కనిపిస్తాయి. వాటికి తగ్గ పాత్రధారులను ఎంపిక చేయడం అంత సులువైన వ్యవహారం కాదు.

అటు రాజకీయంగాను.. ఇటు సినిమా పరంగాను.. ఆయా వ్యక్తులను పోలిన యాక్టర్లను వెతికి పట్టుకోవడం క్లిష్టతరమైన ప్రక్రియే. ఎన్టీఆర్ జీవితంలో.. నాదెండ్ల భాస్కరరావు పాత్రకు కూడా ఎంతో ప్రాధాన్యత ఉంటుంది. ఈ పాత్రతో ముడిపడ్డ సన్నివేశాలు అనేకం ఉంటాయట. అందుకే ఈ క్యారెక్టర్ కోసం సరైన నటుడి కోసం బాగానే అన్వేషణ చేయాల్సి వచ్చింది. మొదటగా ఈ రోల్ కు పరేష్ రావల్ ను తీసుకోవాలని భావించారు. కానీ ఇప్పుడు మరో బాలీవుడ్ నటుడు సచిన్ ఖేద్కర్ ను ఫైనల్ చేసుకున్నారట. రీసెంట్ గా సచిన్ కు నాదెండ్ల పాత్రకు సంబంధించిన నెరేషన్ కూడా ఇచ్చారని తెలుస్తోంది.

ఎన్టీఆర్ మూవీలో నటించేందుకు సచిన్ ఖేద్కర్ కూడా ఆసక్తి ప్రదర్శించాడట. రియల్ లైఫ్ క్యారెక్టర్ లో నటించేందుకు ఎంతో ఆసక్తికరంగా ఉన్నట్లు చెప్పాడట. సచిన్ ఖేద్కర్ బాడీ లాంగ్వేజ్.. మేనరిజమ్స్ వంటివి నాదెండ్ల భాస్కరరావుకు దగ్గరగా ఉంటాయని.. అందుకే ఆయనను ఈ పాత్రలోకి తీసుకుంటున్నామని చెబుతున్నారు మేకర్స్.