Begin typing your search above and press return to search.

ఈసారైనా సక్సెస్ అయ్యేనా

By:  Tupaki Desk   |   8 Sept 2017 11:51 AM IST
ఈసారైనా సక్సెస్ అయ్యేనా
X
వెండితెరపై కనిపించాలనే ఇష్టంతో చాలా మంది వ్యాపార ప్రముఖుల పిల్లలు, రాజకీయ నేతల కుటుంబీకులు సినిమాల్లో డైరెక్ట్ హీరోగా ఎటాక్ చేస్తారు. అదే తరహాలో వ్యాపార రంగాల్లో ఎంతో సక్సెస్ అయిన సచిన్ జోషి సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. 2002 నుంచి ఆయన సినిమాల్లో అదృష్టాన్ని పరీక్షించుకుంటూనే ఉన్నారు. అయితే బిసినెస్ లో సక్సెస్ అయినట్టుగా సినిమాల్లో హీరోగా మాత్రం అంతగా రాణించడం లేదు.

అయినా సచిన్ ప్రయత్నాలు మాత్రం ఆపడం లేదు. అపజయాలతో సంబందం లేకుండా తనదైన శైలిలో సినిమాలు చేస్తున్నాడు. అయితే ఇప్పుడు మరో కొత్త తరహా కథతో రబోతున్నాడు. తమిళ్ రూపొందించిన యర్ ఇవన్ అనే సినిమాను తమిళ్ - తెలుగులో ఈ నేల 15న రిలీజ్ చేయబోతున్నాడు. SMS - భీమిలి కబట్టి జట్టు వంటి సినిమాలను తెరకెక్కించిన తాతినేని సత్య ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. ఇక సచిన్ సరసన ఈషా గుప్తా హీరోయిన్ గా నటిస్తుండగా వెన్నెల కిషోర్ ఒక ముఖ్య పాత్రలో కనిపించబోతున్నాడు.

అయితే ఈ సినిమాకు పోటీగా అదే రోజు సునీల్ 'ఉంగరాల రాంబాబు' అండ్ 'ప్రేమ ఎంత మధురం ప్రియురాలు అంత కఠినం' అనే సినిమాలు కూడా రిలీజ్ కాబోతున్నాయి. ఈ రెండు సినిమాల్లో సునీల్ సినిమా ఆ వారంలో పెద్దదిగా చెప్పుకోవచ్చు. మరి సచిన్ ఎంతవరకు పోటీని ఇస్తాడో చూడాలి.